By Village Missionary Movement
Tuesday, 30-Jan-2024దిన ధ్యానము(Telugu) 30.01.2024
అంశం:- ఆత్మీయ పరిపక్వత
"నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని" - 1 కోరింథీయులకు 13:11
క్రీస్తు నందు జన్మించిన ప్రతి ఒక్కరము ఆయనలో ఎదగాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. దేనిలో ఎదగాలి అంటే ఆత్మీయ జీవితంలో, సద్గుణాలలో, దేవుని ఐక్యతలో, లోతైన ప్రార్థన జీవితంలో అని చెబుతూ వెళ్ళవచ్చు. ఇలా అంచలంచెలుగా పెరుగుతూ ఆత్మీయ పరిపక్వత కలిగినవారముగా మారాలి అని దేవుడు ఎదురుచూస్తున్నారు. పరిపక్వత అనే దానికి గుర్తు ఏమిటి? దాన్ని ఎలా కనిపెట్టగలము? అని అడిగిన యెడల బిందెలో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు అది శబ్దం చేస్తూ ఉంటుంది కానీ నిండుగా ఉన్న బిందె ఎప్పుడు శబ్దం చేయదు అనే విధముగా ఆత్మీయ జీవితంలో ఎదగని వారు నీళ్లు నిండని బిందెవలె చిన్న చిన్న కార్యాలకు కూడా బాధపడుతూ ఉంటారు. క్రైస్తవుడనైనా నాకే ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు అని శబ్దము చేసేవారిగానే కనబడుతూ ఉంటారు. అంగలార్పు స్వరం ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది కానీ ఆత్మీయ పరిపక్వత గలవారు దేవుని ప్రేమ చేత నింపబడిన వారిగా నెమ్మదిగలిగిన వారిగా ఉంటారు. అటువంటి వారి గురించి ధ్యానం చేసుకుని ఆత్మీయ పరిపక్వతలో మనం ఎలా ఎదగాలి అనే దాన్ని ఆలోచిద్దాం.
ఇతరులకు అవకాశం ఇచ్చే మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఇప్పుడు తాము వహించే బాధ్యత విడిచిపెట్టుటకు దీనస్థితిలో ఉన్న వారికి ఇచ్చుటకు ముందుకు వస్తారు. అనగా అందరికీ చివరి వారిగా అనగా కాళ్ళను కడిగే విధముగా సేవ చేసే మనసుతో కలిగిన వారుగా ఉంటారు (లూకా సువార్త 14:11). బైబిల్లో యోనాతాను సౌలు రాజు యొక్క సొంత కుమారుడుగా ఉండినప్పటికీ తాను స్నేహం చేసిన దావీదుతో మీరు ఇశ్రాయేలు రాజుగా ఉంటారు అప్పుడు నేను మీ తర్వాత వాడినై ఉంటాను (1సమూయేలు 23: 15) లో అంటున్నాడు. ఇది మనకు మంచి మాదిరి కదు.
ఇతరులు మనకంటే ఉన్నతమైన వారిగా తలంచుతారు. చదువు లేని, వారు పేదవాళ్లు, రక్షింపబడిన వారు ఎవరు ఉండినప్పటికీ వారు తమకంటే గొప్పవారిగా దాని నుంచి సంపూర్ణ ఘనతను ఇచ్చి వాళ్లతో ప్రేమతో నడుచుకుంటారు (ఫిలిప్పి 2:3) ఘనపరచుటలో ముందుంటారు ఈయన నాకంటే వయసులో, చదువులో, ఘనతలో తక్కువ వాడే కాబట్టి మొదటిగా మాట్లాడనీయుడి తర్వాత నేను మాట్లాడుతాను అనే తలంపు కలిగి ఉంటారు. కారణము తమను గురించి ఎలాంటి గర్వపు తలంపు వారికి లేనందువలన ఎలాంటి ఆటంకం లేకుండా ఇతరులను ఘనపరుచుటకు ముందుంటారు (రోమా 12 :10). మనము ఎలా ఉన్నాము? మనలో పరిపక్వత ఉందా లేక అన్నిటికి ఏడుస్తూ తమతో ఉన్న వాళ్ళ పైన నేరాలు మోపుతూ చిన్న పిల్లల వలె ఉంటున్నామా లేదా ఆత్మీయ పురుషుల వలె ఉంటున్నామా?
- సిస్టర్. ఎస్ జైకుమారి గారు
ప్రార్థన అంశం:-
డ్రగ్ ఎడిట్ సెంటర్ కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250