By Village Missionary Movement
Sunday, 28-Jan-2024దిన ధ్యానము(Telugu) 28.01.2024 (Kids Special)
అంశం:- అవసరమైన దాన్ని ఇస్తారు
"మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలుసు” - మత్తయి 6:8
ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు.
హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము కథ విందామా ఒక ఊర్లో లీల అనే చిన్న పాప ఉండేది. ఆమె తల్లిదండ్రులు ఆమెను బుజ్జిగా పెంచారు. అడిగినవన్నీ కూడా కొనిచ్చేవారు లేకపోతే లీల ముఖాన్ని తిప్పుకొని ఎవరితో మాట్లాడకుండా ఏడుస్తూ ఉండేది. కొని ఇచ్చిన వస్తువులను పెట్టుకొని సంతోషించకుండా కొనని ఆ ఒకే ఒక వస్తువు గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండేది. తల్లిదండ్రులు ఆమెతో ఎంత చెప్పినా ఆమె మనస్సు మారనే మారలేదు.
ఒక దినం తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్ కి వెళ్ళింది లీల. అక్కడ ఒక ఖరీదైన చాక్లెట్లు చూపించి అది నాకు కావాలి అని అడగడం ప్రారంభించింది. ఆమె తండ్రి ఇది చాలా చిన్న చాక్లెట్ ఖరీదైనది నువ్వు వేరే ఏదైనా అడుగు నేను కొని ఇస్తాను అని అన్నారు. లీల అయితే లేదు లేదు నాకు ఆ చాక్లెట్ కావాలి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ దినము చాలా కోపంతో ఉండిన తండ్రి దానిని కొని ఇవ్వకుండా షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసారు. చాలా దుఃఖముతో పడుకోవడానికి వెళ్ళింది లీల.
మరుసటి రోజు సాయంకాలం సమయంలో లీల ఆడుతూ ఉన్న సమయంలో ఆమె తండ్రి ఆమెకు కొత్త సైకిల్ను కొనిచ్చారు. దానిని చూసిన లీలా చాలా సంతోషించింది. సైకిల్ ఎక్కి తన ఇంటి చుట్టూ రౌండ్ కొడుతూ ఉండేది. అప్పుడు నిన్న చాక్లెట్ కొరకు ఏడ్చింది ఆమె గుర్తుకొచ్చింది. ఆ చాక్లెట్ కొని ఉంటే తిన్నంత వరకే సంతోషం ఉండేది కానీ ఈ సైకిల్ తో రౌండ్ కొట్టడం వల్ల చాలా సంతోషం అనిపించింది అని తన తల్లిదండ్రుల వద్ద తన తప్పును ఒప్పుకొని ఇక అలాగ పట్టుదలతో ఉండకుండా మంచి పిల్లగా ఉంటారని క్షమాపణ అడిగింది.
ఏంటి పిల్లలు మీకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ యేసయ్యకు మీ తల్లిదండ్రులకు బాగా తెలుసు కాబట్టి ఇదే కావాలి అని ఎప్పుడు పట్టుబట్టకండి. మీకు అవసరమైన వాటిని సరి అయిన సమయంలో మీ తల్లిదండ్రుల ద్వారా యేసయ్య ఇస్తారు.
- శ్రీమతి. ఐడా కింగ్ డేవిడ్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250