Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.01.2024
Share:

By Village Missionary Movement

Saturday, 27-Jan-2024

దిన ధ్యానము(Telugu) 27.01.2024

 

అంశం:- అగ్ని మండించే పరిశుద్ధాత్ముడు

 

"తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు" - హెబ్రీయులకు 1:7

 

అనేక సంవత్సరాలుగా ముయబడిన ఫ్యాక్టరీ ఒకదానిని ఒకాయన కొనుక్కుని దాంట్లో పని వారిని పనికి అమర్చారు. వారందరూ అక్కడ ఉన్న యంత్రాలను స్టార్ట్ చేయడానికి ప్రారంభించారు కానీ ఏమీ పని చేయలేదు. చక్రాలను తిప్పి చూసారు హ్యాండిల్ ను తిప్పి చూశారు గ్రీసు వేసి చూశారు అయినా అది పనిచేయలేదు. చివరికి కొందరు పనివాళ్ళు బాయిలర్ గదిలోనికి వెళ్లి చూచినప్పుడు అక్కడ అగ్ని లేకుండా ఉండటం చూశారు. వెంటనే ఆ బాయిలర్లను మూత తీసి చెక్కలను వేసి అగ్గి ముట్టించారు. త్వరగా ఆవిరి ఏర్పడి పిస్టల్లను, సిలిండర్లోకి వెళ్లి ఇంచుమించు ఒక గంట తర్వాత ఫ్యాక్టరీ అంతా కూడా పనిచేయడం ప్రారంభించింది.

 

 ఆ దినము 120 మంది కూడి ఉన్న పై గదిలో బలమైన గాలి వచ్చి అగ్ని వంటి నాలుకలుగా పరిశుద్ధాత్ముడు దిగి వాళ్ళను నింపాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు యేసు క్రీస్తు ప్రభువుకు సాక్షిగా నిలబడ్డారు. ఆయనను తిరస్కరించిన పేతురు కూడా ఆత్మ చేత నింపబడిన వాడిగా ధైర్యంతో ప్రసంగించాడు. ప్రజలు వారి యొక్క ధైర్యమును చూచి ఆశ్చర్యపోయారు. ప్రసంగాన్ని విని 3,000 మంది 5000 మంది అని గుంపులు గుంపులుగా దేవుని వద్దకు వచ్చారు. ఇది ఎలా సాధ్యమైనది? దేవుని ఆత్మ వలనే అయింది. అవును ఆయనలో గల పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము అగ్నివంటి నాలుకలుగా మండుతూ ఉంది. 

 

కానీ ఈ దినము అనేక సంఘాల్లో అగ్ని ఆరిపోయి ఉంది దీనికంటే దుఃఖకరమైన కార్యం మరింకేది లేదు కాబట్టి ఎలాంటి కదలికను అభివృద్ధిని చూడలేకపోతున్నాము. అనేక దేవాలయాలలో మంచి ప్రార్థన ఉన్నది, చక్కగా వాయిద్యాలు వాయించే వారు ఉన్నారు, తెలివిగల ప్రసంగీకులు ఉన్నారు అలా ఉన్నప్పటికీ ఉజ్జీవం లేకుండా ఉండటం కారణం ఏమిటి? అంటే అగ్ని లేదు పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని ఉండిన యెడల అక్కడ ఉజ్జీవం వస్తుంది. గొప్ప ఆత్మల రక్షణ కలుగుతుంది. 

 

అభిషేకము పొందిన వారలారా రండి మీయొక్క అగ్ని ఇతరులను మండింపనీయుడి మనం సంఘముగా కలిసి ప్రార్థన చేద్దాం. నూతన ఆత్మలను అనుదినము సంఘములో చేర్చుకుందాం. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. మరనాత! 

- బ్రదర్ టి. శామ్యూల్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న స్వస్థత ఆరాధనలో పాల్గొన్న వ్యక్తులు సంపూర్ణ ఆరోగ్యం పొందుకున్నట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet