By Village Missionary Movement
Friday, 26-Jan-2024దిన ధ్యానము(Telugu) 26.01.2024
అంశం:- హెచ్చరిక తిరస్కరించినప్పుడు
"తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" - 1 కొరింథీ 10:12
హఠాత్తుగా ఒక భయంకరమైన పేలుడు శబ్దము ఆ నావలో వినబడింది. నావ అడుగు భాగంలో గల ఇంజనీర్స్ పనివాళ్ళు అందరూ కూడా తమ పనిలో నిమగ్నమై ఉంటుండగా వారు ఉంటున్న గదిలోనికి నీళ్లు చాలా వేగంగా లోపలకు వచ్చాయి. నావ యొక్క బాయిలర్ పేలుడు వలన ఈ ప్రమాదం సంభవించింది. మరణకరమైన సూచన కాబట్టి దిగ్భ్రాంతికి గురయ్యారు ఇంజనీర్స్. టైటానిక్ అనే బ్రహ్మాండమైన నావా రెండు ముక్కలుగా పేలిపోయి ఆ చీకటి సముద్రపు నీటిలో నెమ్మది నెమ్మదిగా మునిగిపోయింది. సముద్ర ప్రయాణ చరిత్రలో ఇది ఒక గొప్ప దుఃఖకరమైన సంఘటన.
ఆ చీకటి రాత్రిలో మంచు గడ్డతో నిండిపోయి ఉన్నా ఆ సముద్రపు నీటిలో మరణ ఘోషతో పోరాడుతున్న వందల కొలదిమంది ప్రజలు చేస్తున్న ఆ ఆర్తనాదాలు ఈ దినము మనము తలచుకున్న ఒక్క నిమిషము మనము ఏమీ చేయలేని వారిగా ఉండిపోతాం. చక్కగా నిర్మించబడిన మన అంతరంగములో నిర్మించిన పాపము గురించి దేవుడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేకసార్లు హెచ్చరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం మిక్కిలి మనోధైర్యముతో, అశ్రద్ధతో దేవుని యొద్ద నుండి వచ్చే హెచ్చరికలను తిరస్కరిస్తూ ఉన్నాము. నా జీవితము, మార్గము సరైనదే నాలో పాపము లేదు, ఈ సందేశము నాది కాదు అని తలంచుతూ ఉన్నాము. నేను పారంపర్య క్రైస్తవుడను నాకు రెండవ రాకడలో చోటు లేకుండా ఉండకపోదు అని అనుకుంటున్నామా? అది ఆ విధముగా జరగనే జరగదు. మన గురించి మనము ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం.
ప్రియమైన వారలారా మరణము, తీర్పు మన ముందు వేచియున్నది అయినప్పటికీ మనము మన యొద్ద వేగముగా వస్తున్న హెచ్చరికలు తిరస్కరించి తెగింపుతో ముందుకు వెళుతూ ఉన్నాం. ఒకటి గుర్తుంచుకుందాం. మరణము పక్షపాతం లేనిది కాబట్టి మన సొంత బలాన్ని నమ్మకుండా దేవుని కృప మీద ఆధారపడదాం. మనల్ని మనము తగ్గించుకొని దేవుని నడిపింపునకు చెవియొగ్గుధాం. గర్వముతో నడిచి మన జీవితాలను నాశనం చేసుకొనకుండా ఆయన కొరకు, ఆయన కృప కొరకు వేచి ఉండుటకు లోబడుటకు జాగ్రత్త పడదాం.
- శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్ గారు
ప్రార్థన అంశం:-
ఈ సంవత్సరంలో తమిళనాడులో గల 38 జిల్లాల్లో కూడా యవ్వనస్తుల కూడిక జరిపింపబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250