Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.01.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 23-Jan-2024

దిన ధ్యానము(Telugu) 23.01.2024

 

అంశం:- మంచి నేలలో పడిన విత్తనం

 

"అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు" - అపో.కార్యములు 10:2

 

విత్తనములు చాలా చిన్నవిగా ఉండినప్పటికీ వాటి నేలలో విత్తినప్పుడు అవి మొలిచి పెరగడం ప్రారంభిస్తాయి. ఒక వ్యవసాయకుడు తన పంట పొలములో విత్తనములు విత్తినప్పుడు మంచి రాబడిని ఎదురు చూసి సంతోషముతో విత్తుతాడు. పంటలు ఎదిగినప్పుడు చక్కగా దానికి నీరు పోసి ఎరువువేసి దానిని బాగా శుభ్రం చేసి ఆ పంట యొక్క ఎదుగుదలను చూసి చాలా సంతోషిస్తాడు. విత్తనములు ఎదగకుండా ఎండిపోయిన లేదా మంచి పంట రాకుండా పోయిన యెడల వ్యవసాయకుడు చాలా దుఃఖపడుతాడు. 

 

బైబిల్లో కూడా , విత్తెవాడి గురించి ఉపమానము ఏసుక్రీస్తు ప్రజలకు చెప్పి బోధించారు మార్కు సువార్త 4:3-6 వరకు గల వాక్యములు విత్తనములు విత్తే వాడి గురించి విత్తనాలు మరియు పంట పొలం గురించి మనము చూడవచ్చు. త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాత్రి నేలలో పడిన విత్తనాలు, ముండ్లపోదలలో పడిన విత్తనాలు, మంచి నేలలో పడిన విత్తనాలు అని లూకాసువార్త 8:11 లో మనం చూస్తున్నాం. విత్తేవాడు వ్యవసాయకుడు ఇది వాక్యమును ప్రజల దగ్గర విత్తే సేవకుని చూపిస్తుంది. క్రీస్తు బోధ చేత ఈ నాలుగు విధములైన నేలలు నుండి మంచి ఫలితాలను ఇస్తున్న ప్రజలు అని బైబిలు చెబుతుంది. 

 

 మంచి నేలలో ఉన్న అనేకులు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి కొర్నేలీ. వేరే జాతికి చెందిన వాడిగా ఉన్నప్పటికీ తెరవబడిన హృదయముతో యదార్ధమైన దైవభక్తితో తమను వెతుకుతున్న ఎవరికైనా దేవుడు దర్శించుటకు సమర్ధుడు అని చెప్పడానికి కొర్నేలీ ఒక మంచి ఉదాహరణ. దేవుని యందలి భయభక్తులు కలిగిన వ్యక్తి దేవునికి భయపడి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేవాడు. ఎప్పుడూ దేవుని వైపు చూసి ప్రార్థించేవాడు. దేవునికి లోబడిన కొర్నేలీ తన కుటుంబము అంతటినీ కూడా దేవుని యొక్క సందేశం వినాలి అని తన కుటుంబాన్ని బంధువులను సమకూర్చి దేవునికి లోబడిన మార్గంలో జీవించిన వాడు. ఆయన ఒక అధికారిగా ఉండినప్పటికీ దేవుని దాసునికి ఇవ్వవలసిన మర్యాదను ఇచ్చి తగ్గింపుతో నడుచుకున్నాడు. ఇతను, ఇతని ఇంటి వారును పరిశుద్ధాత్మను పొందుకొని వెంటనే బాప్తీసము పొందుకున్నారు. ఈయన మంచి నేలలో పడిన విత్తనములుగా దేవునికి సాక్ష్యముగా నిలబడ్డారు. 

 

ప్రియమైన వారలారా మనము ఏ నేలలో పడిన విత్తనములుగా జీవిస్తున్నాము అని మనలను మనం పరీక్షించుకొని చూద్దాం. మనము మనకు కలిగి ఉన్న కార్యముల వల్ల ఇతరులకు ప్రయోజనం కలదా? మన వలన ఇతరులు ప్రయోజనం పొందేటట్లు మంచి ఫలితాలను ఈ సంవత్సరం ఇచ్చేటట్లు మనం ప్రయాస పడదాం. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్! 

- శ్రీమతి. సరోజ మోహన్ దాస్ గారు 

 

ప్రార్థన అంశం:-

నెలలో గల 30 రోజుల్లో 30 ఇళ్లల్లో ప్రార్థన కూటములు మన ఫీల్డ్ లో జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet