Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.01.2024
Share:

By Village Missionary Movement

Monday, 22-Jan-2024

దిన ధ్యానము(Telugu) 22.01.2024

 

అంశం:- కన్నీటితో విత్తుడి

 

"కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు" - కీర్తనలు 126:5

 

చైనా వెదురు అనే ఒక విధమైన వెదురు పంటను పండించాడు ఒక వ్యక్తి. విత్తిన మొదటి రోజు నుంచి దానికి తప్పుక నీళ్లు పోస్తూ పరామర్శిస్తూ వచ్చాడు. ఎంత నీరు పోసినా ఆ వెదురు కర్రలు ఎంత మాత్రమూ మొలవలేదు. దినాలు గడిచాయి, నెలలు గడిచాయి ఎందుకు సంవత్సరాలు కూడా దాటిపోయాయి. ఆయన చుట్టూ మిగతా పంటలు పండించేవారు అనేక ఫలితాలను చూశారు సంతోషించారు కానీ ఇతను అయితే చుట్టూ ఉన్న వారి చేత హేళన చేయబడి ఉండిపోయాడు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన నేలలో వెదురు కర్రలు మొలవడం ప్రారంభించాయి. దాని యొక్క వేగము రోజురోజుకీ పెరిగింది ఇంచుమించు ఆరువారాలలో సుమారు 90 అడుగుల ఎత్తుకు ఎదిగింది. దానిని చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. కన్నీటితో విత్తు వారు సంతోషముతో పంటను కోసేదరు అని మాట ప్రకారము జరిగింది. 

 

బైబిల్లో హన్నా అనే స్త్రీ గురించి మనం చూస్తున్నాం. హన్నాకు పిల్లలు లేరు ఇందువలన పెనిన్న ఆమెను చాలా చిన్నచూపు చూసింది. హన్నా దేవాలయంలోనికి వెళ్లి తన హృదయములో ఉన్న చింతలన్నిటిని కూడా దేవుని వద్ద చెప్పింది. దేవుడు హన్నా యొక్క విజ్ఞాపనను దేవుడు విని ఒక కుమార్తెను దయ చేశారు. ప్రార్థన అద్భుతాలను తీసుకొచ్చింది ఫలితం పరిచర్య చేసిన సమూయేలు పుట్టాడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఒక ప్రవక్తను వారికి ఇచ్చాడు మొదటి సమయాలు 3: 20. ఇశ్రాయేలు రాజులైన సౌలు మరియు దావీదును అభిషేకించే వాడిగా సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల న్యాయం విచారించుటకు న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. ఇలా పరిచర్య చేయగలిగినటువంటి సమూయేలు హన్నా ప్రార్థన ద్వారా వచ్చాడు. 

 

ప్రియమైన వారలారా చైనా వెదురు కర్ర నేర్పించినది హన్నా యొక్క జీవితంలో నేర్చుకున్నది ఒకటే. సమయము కొరకు వేచి ఉండుము అన్నది. నిందలు, అవమానాలు, కన్నీరు, ఎన్ని ఉన్నా మీ విజ్ఞాపనను విడిచి పెట్టకండి. అంతరంగమును చూస్తున్నా తండ్రి మీకు బహిరంగంగా ఫలితాన్ని ఇస్తారు. మీరు చేసిన మేలులకు ఫలితము ఈ నూతన సంవత్సరంలో విస్తారంగా మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్ములను దీవించును గాక. 

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన నార్త్ ఇండియా ఫీల్డ్ పరిచర్య గురించి ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al