Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.01.2024
Share:

By Village Missionary Movement

Friday, 19-Jan-2024

దిన ధ్యానము(Telugu) 19.01.2024

 

అంశం:- ఆశ్రమము 

 

"ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు" – అపోస్తులులకార్యము 10:38

 

ఇతరుల వద్ద ఎలాంటి ప్రతిఫలాన్ని ఎదురు చూడకుండా సహాయము చేయుట అన్నది శ్రేష్టమైన సద్గుణము. బైబిల్లో సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడియున్నాము అని పౌలు రాస్తున్నాడు. అవసరతలో ఉన్నవారిని వెతుకుతూ సహాయము చేయుట దైవిక గుణాతిశయము. 

 

అల్పెనియా దేశంలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన మదర్ థెరీసా1929వ సంవత్సరము డిసెంబర్ 6వ తారీఖున భారతదేశమునకు వచ్చారు. పాకిస్తాన్ యొక్క సమస్య వలన కళ్లెదుట జరిగిన హత్యలను ఆమె చూసి, కష్టమైన కార్యాలు సమాజంలో అధికంగా ఉండడు చూచి ఆమె తట్టుకోలేక పోయారు. కన్యాస్త్రీగా హాస్టల్లో ఉన్నప్పటికీ పేదరికంలో ఉన్నవారికి, రోగంగా ఉన్న వారిని కనిపెట్టి వారికి సహాయం చేస్తూ ఉండేవారు. కుష్టు రోగులను తీసుకుని వెళ్లి వైద్యం అందించేవారు. ఒక గుడి పక్కనే గల ప్రాంతంలో ఆమె యొక్క ఆశ్రమం నడిపిస్తూ వచ్చారు. ఆ గుడిలో ఉన్న పూజారి ఆమెను హత్య చేయాలి అని ప్రయత్నించారు. తర్వాత అతను మదర్ థెరీసా యొక్క శిష్యుడుగా మారాడు. అనేక మంది పేద పిల్లలను దత్తత తీసుకొని తన చేతి ద్వారా శుభ్రపరిచారు. మదర్ థెరీసా ప్రజల సహాయమే పరమ దేవుని సహాయము అని అనుకున్నారు. లోకమంతటి నుండి అనేక బిరుదులు ఆమెకు వచ్చాయి అన్ని కూడా పేద బిడ్డలకు ఖర్చుపెట్టారు. 1979 వ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకైన నోబెల్ బహుమతి ఆమెకు దొరికింది. మదర్ థెరీసా ఆమె జీవితమంతా ప్రజల కొరకు పని చేయుటకు గురిగా పెట్టుకొని తన పరుగును ముగించారు. 

 

మన ప్రభువైన ఏసుక్రీస్తు తన పరిచర్య దినమంతా సువార్తను ప్రకటించడం మాత్రమే గాక అవసరతలో ఉన్న వారికి సమస్త సహాయం చేస్తూ పరిచర్య చేశారని చూస్తున్నాం. ఈ చిన్న వారిలో ఒకనికి ఏమి చేశారో అది నాకే చేశారు అని ఏసుప్రభు తన పరిచర్య దినాల్లో చెప్పి దాన్ని చేసి చూపించారు. పరిశుద్ధుడైన లూకా దీన్ని రాసినప్పుడు మేలు చేసే వ్యక్తిగా ఆయన నడిచారు అని రాస్తున్నాడు. 

 

ప్రభువునందు ప్రియమైన వారలారా ఇతరులకు మేలు చేయుట అనేది ఒక విత్తనం వంటిది. మనము మేలు చేయాలి అని దేవుని చేత సృష్టింపబడి ఉన్నాము. మేలు చేయుటయు దానధర్మాలు చేయుటయు మరువకుడి. ఇలాంటివి దేవుడు ఇష్టపడుతున్నాడు అని హెబ్రీ గ్రంథకర్త రాసి ఉన్నాడు. మనము మేలు చేయుటలో అలసిపోకుండా ఉండని యెడల తగిన కాలంలో పంట కోస్తాం. కాబట్టి మేలు కొరకైనా విత్తనములు విత్తి మేలైన ఫలితాలు పొందుకుందాం. 

- బ్రదర్. శంకర్ రాజ్ గారు

 

ప్రార్థన అంశం:-

పార్ట్నర్ షిప్ మిషనరీలు పరిచర్య చేస్తున్న ఫీల్డ్ లో దేవుని హస్తము తోడై ఉండి వాళ్లను వాడుకునే విధముగా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet