Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.01.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 17-Jan-2024

దిన ధ్యానము(Telugu) 17.01.2024

 

అంశం:- విశ్వాసి ఒక విత్తనం

 

"గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును" - యోహాను 12:24

 

క్రైస్తవ చరిత్రలో అనేక విధములైన విత్తనములు కలవు 

 

1) పూర్వపు పితరులు అనే విత్తనాలు:- బైబిల్లో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలవబడుతున్నాడు అబ్రహాము అనే విత్తనం నుండి అనేక కోట్ల మంది ప్రజలు అనే ఫలితము వచ్చింది. 

 

2) ఆది అపోస్తులు అనే విత్తనాలు:- ఆది అపోస్తులు విత్తనాలుగా తమ్మును తాము అప్పగించుకొనుట చేత అనేక కోట్ల మంది ప్రజలు ఈరోజు విశ్వాసులుగా ఉన్నారు. 

 

3) ఆది మిషనరీలు అనే విత్తనాలు:- దేశాన్ని విడిచి దేశాలకు వచ్చి వేలకొలది మిషనరీలు విత్తనాలుగా పనిచేయడం వలన అనేక కోట్ల మంది ప్రజలు చదువరులుగాను, నాగరికత కలవారుగాను, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారిగాను మారుటకు మిషనరీల విశ్వాస విత్తనాలు లోకమంతట అనేక కోట్ల కొలది విత్తనాలు తరచుగా ఫలిస్తూ ఉండడానికి గల కారణము అక్కడక్కడ విత్తనాలు విత్తబడి వచ్చినది. మనము చూచిన ఈ మూడు విత్తనాలు వారి యొక్క శ్రమలు, త్యాగాలు, పనిపాట్లు ఇవన్నీ విస్తరింపజేశాయి. కానీ ప్రస్తుతం ఈ కార్యాలు లేకుండా తగ్గిపోతున్నాయి. ఫలితం కూడా తగ్గిపోయింది. 

 

ఉత్తర అమెరికాలో ఒక పక్షి జాతి అంతరించిపోతూ వస్తుంది. దానిని చూచిన ఆ దేశ ప్రభుత్వం ఆ పక్షులను పట్టుకొని సంరక్షించడానికి ఒకచోట్లో పెట్టి వాటిని పరామర్శించడం ప్రారంభించారు. అందువలన ఆ పక్షి యొక్క సంఖ్య పెరిగింది. వాటి సంఖ్య ఎక్కువగా విస్తరించడం వలన వాటిని బయట విడిచి పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఎగరవేశారు అయితే రోజులు గడుస్తున్న కొలది మరల ఆ పక్షుల యొక్క సంఖ్య తగ్గిపోవడం వలన మరల వాటిని తమ స్థలములో పెట్టి భద్రపరిచారు. ఇప్పుడు వాటికి గొప్ప తర్ఫీ ఇవ్వబడింది..ఆ పక్షులు తమకు తాము ఆహారం వెతుక్కోనుట, తమ గూళ్ళను ఎలా నిర్మించుకోవాలి, తన పిల్లలను ఎలా సంరక్షించుకోవాలి అని వాటికి తర్ఫీదు ఇవ్వబడింది. మరలా స్వేచ్ఛగా విడిచిపెట్టినప్పుడు ఆ పక్షులు సంఖ్య మరల పెరగడం ప్రారంభించింది అని ఉత్తర అమెరికా పక్షుల సంరక్షణ కేంద్రం చరిత్ర చెబుతుంది. 

 

 ఇలాగే అనేక సంఘాలు తమ విశ్వాసులను గూడులో గల పక్షులుగా విశ్వాసంలో శిశువులు గానే పెట్టుకుని వాళ్లను సంరక్షిస్తున్నాము అని చెప్పి వాళ్ళని పతనము చేస్తూ వస్తున్నారు. ఈ విస్తారమైన లోకంలో విశ్వాసులు యొక్క గుంపు విస్తరించడానికి వాళ్లకు శ్రమల మధ్యలో తర్ఫీదు ఇవ్వబడాలి. ప్రతి విశ్వాసి విశ్వాసం యొక్క పోరాటంలో దిగాలి అప్పుడే ఆ గొప్ప విశ్వాసము గుంపును విత్తనముగా పనిచేసినప్పుడు అనేక ఫలితాలను మనం చూడగలం. 

- బ్రదర్. టీ. సెల్వ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మన మీడియా పని కొరకు అవసరమైన ఉపకరణాలు కొనబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet