Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.01.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 16-Jan-2024

దిన ధ్యానము(Telugu) 16.01.2024

 

అంశం:- విత్తనములుగా ఈయుడి

 

"వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి" – 1 దినవృత్తాంతములు 29:9 

 

ఒక దినము సైన్స్ టీచర్ ఒక మిరపకాయతో క్లాసులోనికి అడుగుపెట్టారు. ఇది ఎలా వచ్చింది అని అడిగారు. దానికి విద్యార్థులందరూ మొక్క నుండి వచ్చింది అన్నారు. వెంటనే టీచర్ మొక్క ఎలా వచ్చింది అని అడిగారు. వెంటనే విద్యార్థులు విత్తనముల నుండి అన్నారు. ఆ టీచర్ దేవుని యొక్క ఆశ్చర్యకర్యాన్ని చూడండి ఒక్క విత్తనం నుండి ఆ కాయలోనికి ఎన్ని విత్తనాలను దేవుడు పెట్టి ఉన్నారు. ఒక్క విత్తనము నుండి ఎన్ని విస్తారమున కార్యాలు జరుగుతున్నాయో చూశారా అని ఆ దినపు పాటన్ని ప్రారంభించారు. 

 

 బైబిల్లో కూడా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు వినుటకు వచ్చిన వారిలో ఒక చిన్న బాబు తన కొరకు పెట్టిన ఐదు రొట్టెలు రెండు చేపలను దూర దృష్టితో తీసుకుని వచ్చాడు. యేసు ఎక్కువసేపు ప్రసంగం చేసి ప్రజలను పంపించేటప్పుడు వారి ఆకలి తీర్చేందుకు శిష్యులను వాళ్లకు ఆహారం ఈయుడి అని అన్నారు. ఆ చిన్న బాలుడు తన కొరకు పెట్టుకున్న ఐదు రొట్టెలు రెండు చేపలు చిన్న విత్తనముగా శిష్యులకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఖాళీ అయినప్పటికీ ఏసుదాన్ని విస్తరింపజేసి 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలకు దానిని ఆహారముగా ఇచ్చారు. మరియు ఇంకా మిగిలింది కూడా వారు తృప్తిగా తిని ఇంటికి కూడా తీసుకుని వెళ్లి ఉంటారు. 

 

 దీనిని చదువుతున్న స్నేహితులారా ఒక దినం యేసయ్య మాటలు విన్న బాలుడే తన కొరకు పెట్టుకున్న దానిని యేసయ్య పరిచర్య కొరకు అవసరము అనిన వెంటనే ఎంత మాత్రం ఆలోచించకుండా విత్తుటకు ఇచ్చాడు. ఈ దినము మీరు నేను ఎన్నో దినములుగా సంవత్సరములుగా ఆయన మాటలు వింటూనే ఉన్నాం. ఉజ్జీవము కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం కానీ ఆత్మలు సంధింపబడుటకు పరిచర్యకైన అవసరము కొరకు ఏమి చేస్తున్నామో కొంత ఆలోచిద్దాం. ఆ చిన్న బాలుడు విత్తినట్లుగా మీరు కూడా ఇవ్వవచ్చు. మీరు పరిచర్యకు ఇచ్చినప్పుడు దానిని యేసయ్య పని కొరకు దాన్ని వాడినప్పుడు దేవుడు దానిని అభివృద్ధి చేస్తాడు. మన యొద్ద ఉన్నది మనకు మాత్రమే ఫలితం కానీ యేసు కొరకు దాన్ని ఇచ్చినప్పుడు అనేక హృదయాలు సంతోషిస్తాయి. పరిచర్యలోను మన జీవితంలోనూ విస్తరణ కలుగుతుంది. ఇదే దేవుడు ఇచ్చే ఫలితం. నిత్యజీవితంలో కూడా దాన్ని చూడవచ్చు (మత్తయి సువార్త 10: 42).లో ఒక గ్లాసుడు చల్లటి నీళ్లు ఇచ్చినట్లయితే దాని ఫలితాన్ని పరలోకంలో పొందుకుంటారని చూస్తాం. కాబట్టి సంపూర్ణ విధేయతతో మనస్ఫూర్తిగా దేవుని కొరకు మనకు కలిగిన దానిని ఇద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ మిషనరీలకు అవసరమైన నాలుగు చక్రాల వాహనాలు కొనబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al