Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.01.2024
Share:

By Village Missionary Movement

Monday, 15-Jan-2024

దిన ధ్యానము(Telugu) 15.01.2024

 

అంశం:- చిన్న విత్తనాలు

 

"విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు" - మార్కు 4:14

 

నేరేడు చెట్టు యొక్క విత్తనము సమస్త విత్తనముల కంటే చాలా చిన్నదిగా ఉండినప్పటికీ అది మొలిచి పెద్ద వృక్షం అవుతుంది. అలాగే బైబిల్లో కొందరు చేసిన చిన్న కార్యాలు గొప్ప ఉజ్జీవంగా రక్షణను విమోచనను తీసుకువచ్చింది. దానిని ఈ దినము చూద్దామా? 

 

1) సిరియా సమరియులను కట్టడి చేయుట వలన గొప్ప కరువు ఏర్పడింది. దేవుడు క్రియా జరిగించుట శత్రు సైన్యము విడిచి వెళ్లిపోయింది. నలుగురు కుష్టి రోగులు సిరియ సైన్యము యొక్క క్యాంపు లోనికి వచ్చినప్పుడు గుడారంలో ఆహారము మరియు వస్తువులను చూసి దానిని భుజించి ఆకలి తీర్చుకున్నారు. ఈ సువార్తను రాజ భవనంలో ఉన్న వారికి ప్రకటించుట ఆలస్యము చేయుట నేరమని గ్రహించి త్వరగా రాజా భవనంలో ఉన్న వారికి చెప్పారు. సమాజంలో తృణీకరించబడిన వారు దేనికి భయపడలేదు (2రాజులు 7: 1 - 16)

 

2) ఆహాబు రాజు భవనం యొక్క విచారణ కర్త అయిన ఓబద్య తన ప్రాణమునకు హాని ఉన్నప్పటికీ ఆహాబును ఏలియాను దర్శించేటట్లు చేశాడు. ఫలితము కర్మేలు పర్వతంలో ఇశ్రాయేలీయుల మధ్య గొప్ప ఉద్యమం ఏర్పడింది (1రాజులు 18:1-39) 

 

3) పౌలు మరియు ఖైదీలు ఇటలీకి ప్రయాణం చేస్తున్న నావా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు పౌలు దేవుని మాటలు చెప్పి ఆ నావలో ఉన్న 276 మందిని బలపరిచి తప్పించుకొనుటకు ఆకలిగా ఉన్నవారికి భోజనము చేసి బలము పొందుకొనమని చెప్పి తాను భుజించి అందరిని ఉత్సాహపరిచి భోజనం చేసినట్లు చేశాడు. ఫలితము అందరూ తప్పించుకొని మెలితే అనే దీవినకు చేరగలిగారు సువార్త ప్రకటించబడింది. 

 

ప్రియమైన వారలారా! నేను దేవునికి ఏమి చేయగలను అని మీ ఆత్మలో కృంగిపోకుండా నలుగురు కుష్టు రోగుల వలె ఏసు ప్రభువు మనకు దయచేసి విమోచనను మన దేశ ప్రజలకు సువార్తగా ప్రకటించవచ్చు. ఓబద్యా వలె ఒక స్థలములో గొప్ప ఉద్యమము రావడానికి ఒక సేవకుడిని మీరు వాడుకోవచ్చు. బ్రతుకుతామా లేదా అని నిరుత్సాహపడే పరిస్థితిలో దేవుని మాటలు చేత ధైర్యపరిచి వాళ్ళను బలపరుచుటకు దేవుడు మిమ్మల్ని వాడుకోవచ్చు. పైనే చెప్పబడిన వ్యక్తులు వలె కన్నీటి ప్రార్థనతో ఏదైనా ఒక కార్యము ద్వారా దేవుని వాక్యాన్ని విత్తిని యెడల కోతకు యజమాడైన గొప్ప దేవుడు గొప్ప ఆత్మలు అనే కోతను మన కొరకు సిద్ధము చేసి ఉన్నారు. 

- శ్రీమతి. గీతా రిచర్డ్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో ప్రారంభించబడుతున్న కొత్త స్కూలు కొరకు అది సిద్ధపరచబడే పనులు కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al