Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.01.2024
Share:

By Village Missionary Movement

Monday, 08-Jan-2024

దిన ధ్యానము(Telugu) 08.01.2024

 

అంశం:- దీవించబడిన వ్యక్తి

 

"కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును" - న్యాయాధిపతులు 5:24

 

పాత నిబంధన గ్రంథములో సాధారణమైన స్త్రీగా గుడారంలో నివాసము చేసిన స్త్రీ యాయేలు జీవించే విధానాన్ని చూద్దాం. ఆమె ఎలాంటి యుద్ధానికి వెళ్లి యుద్ధం చేయలేదు కానీ ఆమె అలా విజయం సాధించడం గల కారణం ఏమిటి. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి కీడైన కార్యములు చేసినందున దేవుడు వాళ్లను కానానీయుల రాజైన యాబను చేతికి అప్పగించారు. ఆయన ఇశ్రాయేలీయులను 20 సంవత్సరములు చాలా కఠినంగా పరిపాలించాడు. అప్పుడు దేబోరా అనే ప్రవక్తరాలు ఇశ్రాయేలీయులకు న్యాయం చేస్తూ వచ్చారు. దేవుడు ఇశ్రాయేలీయుల పైన కనికరపడి దేబోరా ద్వారా బారాకును పంపించి సిసేరాతో యుద్ధం చేయుటకు పంపించారు. అలా పంపించినప్పుడు ఈ యుద్ధంలో మేలు నీకు కలుగదు కానీ దేవుడు సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తారు అని చెప్పాడు. అందువలన కయీనుడైన హెబెరు భార్య అయినా యాకేలు సిసేరాను గుడారపు మేకుతో కొట్టి చంపేసింది

 

గుడారంలో జీవించి వచ్చిన ఆ యాయేలుకు ఎంత ధైర్యం ఒంటరిగా గొప్ప సైనికుడిగా ఉండిన సిసేరా అనే సైన్యాధిపతిని చంపేసింది. ఆమె వరకు అది చాలా చిన్న కొన్ని నిమిషములలో చేసి ముగించే పనిగా ఉండేది. దేవుడు ఆమె ద్వారా గొప్ప కార్యములు చేసి పెట్టాడు. తరువాత దేశము 40 సంవత్సరాలు నిమ్మలముగా ఉండేది అని చూస్తున్నాం. 

 

అవును సాధారణ స్త్రీ అయినా యాయేలు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి సరైన సమయంలో దేవుని సహాయముతో చేయబడిన ఎలాంటి చిన్న కార్యమైనను గొప్ప ఫలితం నివ్వగలదు. దివెనలు తీసుకొని రాగలదు. కాబట్టి మనం విత్తె విత్తనములు చిన్నవే కానీ అవి మంచి నేలలో పడేటప్పుడు ముప్పదంతలుగాను, అరువదంతలుగాను, నూరంతలుగాను అది ఫలితాన్ని ఇవ్వగలదని గ్రహించవచ్చు. అలాగే మనం చెప్పే నెమ్మదిగల మాటలు మనము చేసే చిన్న చిన్న ప్రార్థనలు గొప్ప ఫలితాలు తీసుకుని వస్తాయి. ఆత్మహత్య వైపు వెళ్లే అనేకమంది సువార్తను విని మనసు మార్చబడి జీవించినదాన్ని, రక్షణ సంతోషాన్ని అనుభవించిన దాన్ని చూస్తున్నాం. నా యొక్క పసిప్రాయములో నేను చేసిన చిన్న ప్రార్థన యేసయ్య రక్షించండి అనే మాటలే దాని యొక్క భావాలు కూడా నాకు తెలియదు కానీ చెప్పబడిన ప్రార్ధన విని దేవుడు తగిన కాలంలో నన్ను తన విలువ గలిగిన రక్తము చేత నా పాపాన్ని కడగి రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నారు. మనము ఒక అడుగుపెట్టిన చాలు దేవుడు మన కొరకు వంద అడుగులు మనలను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరంలో నిరుత్సాహపడిపోకుండా మనం చేయగలిగిన కార్యాలు చేద్దాం. చిన్నచిన్న కార్యాలలో సువార్త అనే విత్తనాలు విత్తుదాం. గొప్ప ఫలితముగా కోతని ఎదురు చూద్దాం. దేవుడు మనకు మంచి ఫలితాన్ని దయచేయును గాక ఆమెన్! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఆమెను విలేజ్ టీవీ ఛానల్ శాటిలైట్ ఛానల్ గా మార్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet