Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.01.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 07-Jan-2024

దిన ధ్యానము(Telugu) 07.01.2024 (Kids Special)

 

అంశం:- అన్నీ కొత్తవే

 

"ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను" - యెషయా 43:19

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు:- 

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తవి అంటే మీకు చాలా ఇష్టం కదా? కొత్త డ్రెస్సు, కొత్త ఉంగరము, కొత్త షూస్ అని కొత్తగా చూస్తేనే మీకు చాలా సంతోషం కదు. అవును యేసయ్యకు మనకు అన్ని కొత్తగా మంచివిగా ఇవ్వడం అన్నదే ఆయన ఆశ. దేనినైన కూడా నూతనము చేయడానికి యేసయ్య సమర్థవంతుడు. సరే కథ విందామా? 

 

గణేష్ ఎనిమిదో తరగతి విద్యార్థి. ఆయన కుటుంబం చాలా పేదరికంలోనూ కష్టాల్లో ఎలాంటి సంతోషము లేనటువంటి కుటుంబము. అమ్మ ఎప్పుడు చాలా దుఃఖముతో ఉండేవారు. భోజనం కూడా ఏదో అన్నము కూర మాత్రం ఉండేది. బట్టలు కూడా ఎవరు ఇచ్చిన పాతవి వేసుకునేవారు. ఇంటిలో సామాన్లు అన్నీ కూడా విరిగిపోయినవి పాతవి ఉండేవి. 

 

ఒక దినము ఆయన ఇంటి పక్కన జరుగుతున్న సండే స్కూల్ కి వెళ్ళాడు. దాన్ని నడిపిస్తున్న అన్నయ్య తనకు చెప్పాడు యేసయ్య మనలను నూతన సృష్టిగా తయారు చేస్తారు అప్పుడు పాతవి గతించి అన్ని నూతనముగా అవుతాయి అని చెప్పారు. అయితే నిన్ను నీవు యేసయ్యకు సమర్పించుకుంటే చాలు నిన్ను యేసయ్య నూతనముగా మార్చుటకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. ఆయన అలానే నమ్మి యేసయ్యకు తనను సమర్పించుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. సండే స్కూల్ అయిపోయిన వెంటనే కొత్త పెన్సిల్ బాక్స్ రబ్బరు అని కొత్తవి ఇచ్చారు. అదే తన జీవితంలో మొట్టమొదటిగా పొందుకున్న కొత్త వస్తువులు. 

 

సంతోషంగా తన ఇంటికి వచ్చాడు. ఆయన నమ్మలేని విధంగా కొత్త వస్తువులు చేత ఇల్లు నింపబడి ఉన్నది. అవన్నీ ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపోయాడు వాళ్ళ అమ్మ పనిచేస్తున్న ఇంటి యజమానులు ఫారెన్ వెళ్లిపోతున్నారు కాబట్టి వాళ్ళుకున్నటువంటి వస్తువులు అన్నీ కూడా వీళ్ళ అమ్మ చాలా రోజుల నుండి యదార్ధముగా పనిచేయడం వల్ల గిఫ్ట్ గా ఇచ్చి వెళ్లిపోయారు. అన్నీ కొత్తవే. సండే స్కూల్లో జరిగిన కార్యాన్ని అమ్మకు చెప్పాడు ఇన్ని సంవత్సరాలు దొరకని కొత్త ఆశీర్వాదం యేసయ్య వలన దొరికాయి అని సంతోషించారు. ప్రియమైన తమ్ముడు చెల్లి మీ జీవితము కొత్తగా మారాలా అయితే యేసయ్య చేతుల్లోనికి మిమ్మల్ని సమర్పించుకొనుడి. ఆయన మీ జీవితంలో తన కార్యాన్ని చేస్తాడు. సరేనా పిల్లలు బాయ్! 

- సహోదరి బ్యులా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet