Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.01.2024
Share:

By Village Missionary Movement

Saturday, 06-Jan-2024

దిన ధ్యానము(Telugu) 06.01.2024

 

అంశం:- మాట అనే విత్తనము

 

"ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును" - రోమీయులకు 10:10

 

ఒక చెట్టు నుండి 1000 అగ్గిపుల్లలను తయారు చేయగలము, అదే ఒక అగ్గిపుల్ల వెయ్యి చెట్లను బూడిద చేయగలదు. అలాగే మన మాటలు కూడా అనేకులు యొక్క జీవితాలను బలపరచగలవు ఆ వ్యతిరేకమైన మాట అనేకమైన జీవితాలను పాడు చేయగలదు. 

 

 ఒక ఇంటి యజమానుడు రోజు ఉదయాన్నే లేచి మోకాళ్ళ పైన ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తన యొక్క శరీర బలహీనతలు ఉన్నప్పటికీ దేశ ప్రజల కొరకు వారమునకు ఒకసారి తన స్నేహితులతో కలిసి తన ఇంటిలో ప్రార్థిస్తూ ఉండేవాడు. రక్షింపబడని అతని యొక్క భార్య దేవున్ని తెలుసుకునే విషయంలో ఎంత మాత్రమూ బలవంతం చేయలేదు. తాను థియేటర్కు వెళ్లి సినిమా చూడకపోయినప్పటికీ భార్య ఆశించడం వలన ఏమీ ఆటంకం చెప్పకుండా తానే ఆమెను తీసుకు వెళుతూ ఉండేవాడు. భర్త తనకు ఇచ్చిన స్వేచ్ఛ దేవుని మీద పెట్టిన నిరీక్షణ, జీవిత విధానము, మాట్లాడే విధానం, ఇతరులకు దేవుని గురించి చెప్పే కార్యము వీటిని చూసిన భార్య దేవుని తెలుసుకున్నారు. రక్షింపబడి బలముగా ఎదిగారు. తమ పిల్లలను దేవుని యందు పెంచుటకు తన జీవితం మరియు ప్రేమ గల మాటలు ద్వారా అనేకులను క్రీస్తు నందు నడిపించారు. అది వేరే ఎవరు కాదు మా తల్లి గారే. 

 

ఇలాగే నయోమి మోయబు దేశంలో తమ పిల్లలకు వివాహము చేసినప్పటికీ కుటుంబంలో దేవుని గూర్చిన మాటలు మాట్లాడటం వలన తాను జీవించిన జీవితం వలన తన కోడలైన రూతును సొంతము చేసుకోగలిగింది. అవును నయోమి తాను దేవుడి గురించి మాట్లాడిన మాటలు విత్తనముగా రూతులో నాటపడ్డాయి కాబట్టి రూతు నయోమి యొక్క దేవుడిని విడిచిపెట్టకుండా దృఢముగా పట్టుకొని వెంబడించింది. నయోమి యొక్క మాటలైన విత్తనాలు ఫలితంగా బైబిల్లో ఒక పుస్తకముగా రూతు పేరుగాంచింది. అది మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభువు జన్మించుటకు రూతు యొక్క సంతతిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. 

 

దీనిని చదువుతున్న స్నేహితులారా మీరు రక్షింపబడిన యెడల మీ మాటలు క్రీస్తును గూర్చినవిగా ఉండనివ్వండి. మరణము జీవము నాలుకవసము అని బైబిల్ చెబుతుంది. అలాగే మీ యొక్క నోటి మాటలు అనేకులు యొక్క జీవితాన్ని బలపరచగలవు అనేకులను ఉత్సాహపరచగలవు. మా తల్లి తన ముగ్గురు పిల్లలను క్రీస్తునందు పెంచడం మాత్రమే కాదు ముగ్గురిని దేవుని కొరకు పని చేయుటకు ప్రోత్సహించి దేవుని కొరకు అర్పించారు. అవును మనము ఇతరులతో మన సొంత కార్యములు, మిగిలిన విషయంలో మాట్లాడకుండా దేవుని గురించే మాట్లాడదాం. మాట అనే విత్తనాన్ని విత్తి ఆత్మలను దేవుని కొరకు సొంతం చేసుకుందాం 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో అవసరమైన రోడ్లు, బ్రిడ్జిలు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet