By Village Missionary Movement
Thursday, 04-Jan-2024దిన ధ్యానము(Telugu) 04.01.2024
అంశం:- క్షమించుడి
"ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి" - ఎఫెసీయులకు 4:32
హెరి అనే వ్యక్తి తన 15వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ రాస్తున్నారు. ఆదివారం ఆరాధన ముగించుకొని ఇంటికి తిరిగి ప్రాణంలో కారును నడుపుతాను అని నేను నా తండ్రి వద్ద పర్మిషన్ అడిగాను. ఆయన కూడా కారు నడుపుటకు నాకు అనుమతించారు. దురదృష్టవశాత్తు ఒక టర్నింగ్ దగ్గర కారు అదుపు తప్పి ఒక స్తంభానికి గుద్దుకొని ప్రమాదం జరిగింది. అందులో మాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ మా కారుకు 1000 డాలర్లు ఖర్చు పెట్టవలసిన అవసరం వచ్చింది. నేను చాలా భయపడ్డాను. రేడియేటర్ నుండి ఉష్ మని సౌండ్ వస్తుంది నీళ్లు ఆవిరిగా బయటకు వస్తున్నాయి. నా తండ్రి నా వైపు చూసి పర్వాలేదు నేను క్షమిస్తాను అని చెప్పారు. మా యొక్క కారు బాగుచేయుటకు మా తండ్రికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చయినప్పటికీ మా తండ్రి మరి ఎన్నడును నా జీవితంలో ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. ఈ కార్యము నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. లైసెన్స్ తీసుకున్న తర్వాత కారు నడుపుటకు నా తండ్రి సంతోషముతో అనుమతించారు. మంచి గుణాతిశయముగల తండ్రి ద్వారా పొందుకున్న క్షమాపణ మహోన్నతమైన అనుభూతి అనుభవించుటకు నాకు అవకాశం దొరికింది అని రాశారు. ఈ హెరి అనే వ్యక్తి అమెరికా క్రైస్తవ కుటుంబంలో ప్రసిద్ధిగాంచిన పేరు పొందుకున్నారు.
క్రీస్తు నందు ప్రియమైన వారలారా ఈ దినము వాక్యములో క్రీస్తు మిమ్ములను క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొనుడి అని రాయబడి ఉంది. మన జీవితంలో మనకు అడ్డుపడిన వారు కీడు చేసిన వారిని క్షమించుట అన్నది సాధారణ విషయం కాదు. పౌరుషము, మూర్ఖత్వము, కక్షలు వీటన్నిటినీ ఒక మనిషి హృదయంలో నింపుతూ ఉంటుంది. వీటి మధ్యలో ఇతరులను క్షమించుట అన్నది మనకు అసాధ్యంగా కనబడవచ్చు కాని క్రీస్తునందు మంచి పరిపక్వత, మంచి వాక్యము, దేవుని యొక్క వెలుగు ఉంటేనే మనము ఇతరులను అంగీకరించ గలము. దేవున్ని యదార్థముగా అంగీకరించిన వారు శరీరానుసారముగా గల ఫలాలతో నింపి ఉండరు. క్షమాపణ అనేది దైవిక గుణాతిశయము. దాన్ని పొందుకొనుటకు మన జీవితంలో చాలా కఠినమైన ప్రయాస అవసరము. ఇతరులను క్షమించాలి అనే విత్తనమును మన వ్యక్తిత్వంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం క్షమాపణ పొందుకుంటాం
- బ్రదర్. శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:-
పదివేల గ్రామాల్లో సువార్త ప్రకటించబడాలి అనే ప్రణాళికలో దర్శింపబడుతున్న గ్రామాలలో ఫాలో అప్ పరిచర్య చేయడానికి దేబోరా ప్రార్థన గుంపులు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250