Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.01.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 02-Jan-2024

దిన ధ్యానము(Telugu) 02.01.2024

 

అంశం:- నూతన సంవత్సరం

 

"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను" - 2 కోరింథీయులకు 5:17

 

కొత్త దంపతులకు జీవితం, పిల్లలు పుట్టుక, కొత్త ఇల్లు, కొత్త వాహనం, కొత్త బంగారు నగలు, కొత్త బట్టలు అని జీవితములో కొత్త వస్తువులకు మనమందరము సంతోషముతోనే ఎదురుచూస్తూ ఉంటాం. కొత్త సంవత్సరం దీంట్లో ప్రాముఖ్యమే కానీ ఈ నూతన సంవత్సరంలో మన గురించి దేవుని యొక్క సంతోషాన్ని ఎదురుచూపులు నెరవేర్చుటకు ఏమి చేయాలో మనం ధ్యానిద్దాం. 

 

ప్రతి మనిషి యొక్క పాపమును యేసు రక్తము చేత కడుగుబడి ఆత్మలక్షింపబడాలి ఇదే రూపాంతరము చెందుట లేక రక్షింపబడుట. రక్షింపబడుట ద్వారా పాత రోత జీవితాన్ని మరుగు చేసి నూతన సృష్టిగా మారాలి అన్నదే దేవుని ఎదురుచూపు. మీరు ఒక నూతన సృష్టిగా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలి ఇప్పుడే మీరు మారుమనసు పొంది నూతన సృష్టిగా మారుడి. ముందే మారు మనసు పొందిన వాళ్లు గడిచిన నెలలో ఏర్పడిన ఆత్మీయ అపజయాలు అన్నింటిని దేవుని యొద్ద ఒప్పుకొని మనలను నూతన పరచుకోవాలి. ఇలాగు దేవుని సన్నిధిలో కొన్ని దినాలు వేచి ఉండి మనలను పరిశుద్ధపరచుకొని కొత్త అభిషేకము కొత్త బలముతో ముందుకు వెళ్లాలి. బైబిల్ ధ్యానము, ప్రార్ధన, ఆరాధన పరిచర్యలో కనబడుతున్న నులువెచ్చని పరిస్థితిని మార్చుటకు నిర్ణయించుకుందాం. ఇలా క్రీస్తునందున్న వారి పాత పాపములు అన్ని కూడా విడిచిపెట్టి నూతన పరచుకోవాలి. పూర్వపు కార్యములను జ్ఞాపకం చేసుకొనవద్దు దేవుడు సమస్త కార్యములను నూతనముగా చేస్తారు. లోక కార్యంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటారు. 

 

కొత్త సంవత్సరంలో కొత్త వాగ్దానం పొందుకొని వాటి ద్వారా దీవించబడాలి అని ప్రతి ఒక్కరము కోరుకోవడం తప్పుకాదు. వాగ్దానంలో ప్రధానమైన వాగ్దానము నిత్య జీవమును అనుగ్రహిస్తాను అన్నది ఆయన మనకు చేసిన వాగ్దానం. ప్రతి సంవత్సరం ప్రారంభంలో మన జీవితం యొక్క ప్రారంభము ముగింపు దగ్గరకు వస్తుంది అనే దాని మన గ్రహించాలి. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన కృప కాలమును దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము స్వతంత్రించుకొనుటకు ప్రయాస పడదాం. మన బంధువులు, మన దేశపు వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ వాగ్దానం బట్టి దీవించబడాలని ప్రార్థించి ప్రయాస పడదాం. వాళ్ళు కూడా పరలోక రాజ్యం చేరుకొనుటకు వారి కొరకు ప్రయాస పడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

- శ్రీమతి. గీతా రీఛార్జ్ గారు 

 

ప్రార్థన అంశం:-

పదివేల గ్రామాలు సువార్త ప్రకటించే ప్రణాళికలో దర్శింపబడిన గ్రామాలలో ఇంకా జరగబోతున్న పరిచర్య కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet