Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.12.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 31-Dec-2023

దిన ధ్యానము(Telugu) 31.12.2023 (Kids Special)

 

అంశం:- గుడ్ న్యూస్

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను" - 1 తిమోతికి 1:15

 

జాషువా జోసెఫ్ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకే ఊర్లో నివసిస్తున్నారు. ఎప్పుడు ఎవరిని చూసినా యేసయ్య గురించి చెప్పుట జాషువాకు అలవాటు. తన యొద్దకు వచ్చి ఎవరైనా టైం ఎంత అని అడిగినా కూడా టైం చెప్పి వెంటనే సువార్త చెబుతాడు. ఆయన స్నేహితుడు జోసఫ్ చక్కగా పాటలు పాడుతాడు చర్చిలో యాక్టివ్ గా ఉంటాడు. బోధకుని వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని చాలా పనులు చేస్తూ ఉంటాడు. సువార్త చెప్పాలిరా అని జాషువా జోసెఫ్ తో చెప్పిన ఉండ్రా తర్వాత చూద్దామని చెబుతాడు ఇలాగా రోజులు గడిచాయి. ఒక దినము ఇద్దరూ బస్ స్టాప్ లో బస్ కొరకు వేచి ఉండేటప్పుడు హఠాత్తుగా ప్రమాదం జరిగింది. ఇద్దరు కూడా మరణించారు. ఇద్దరినీ కూడా దేవదూతలు పైకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఒక ఆయన పెద్ద గిఫ్ట్ ని తన చేతిలో పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు జోసెఫ్ ఆ గిఫ్ట్ నా కొరకే నేను కూడా ఒక మంచి పాట రాశాను అని మనసులో ఆలోచించుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అయితే గిఫ్ట్ని జాషువా యొద్దకు తెచ్చి ఇచ్చారు. 

 

జోసెఫ్ కి ముఖము చిన్నది అయింది ఆయనతో ఆ గిఫ్ట్ వాడికి ఎందుకు ఇచ్చారు? నేను చర్చిలో యాక్టివ్ గా ఉంటాను కొత్త కొత్త పాటలు రాస్తాను. మా చర్చ్ పాస్టర్ గారిని అడిగి చూడండి ఆయన కూడా బాగా పొగుడుతారు అని అన్నాడు. అందుకు ఆయన అయితే నీ వెనక్కి తిరిగి చూడు అన్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు కానీ జాషువా వెనకాతల ఒక గుంపు ఉంది. వారందరూ జాషువా చేత సువార్త చెప్పబడి రక్షింపబడిన వారు. యేసయ్య కొరకు వెలకట్టలేని ముత్యము వంటి ఆత్మలు వారు. కాబట్టి జాషువా గొప్పవాడు విలువైన పని చేశాడు అని చెప్పి జోసఫ్ నువ్వు నరకానికి వెళ్ళవలసిన వాడవు అని మాట్లాడుతుంటే కలలో నుండి లేచాడు జోసెఫ్. ప్రభు వద్ద ఏడ్చి ప్రార్థించి ప్రభు యొద్ద సువార్త చెప్పుటకు సమర్పించుకున్నాడు. 

 

ఏంటి పిల్లలు మరి మీరు మీ ఫ్రెండ్స్ కు తెలిసిన వారికి సువార్త ప్రకటించి నరకం వైపు వెళుతున్న ఆత్మలను పరలోకం నడిపిస్తారా? ఇతరులకు సువార్త చెప్పుట మనకున్నటువంటి బాధ్యత దాన్ని మనం కచ్చితంగా చేయాలి కానీ అలా చేయకపోతే మనకు శ్రమ. అది మన మీద పడిన బాధ్యత దానికి మిక్కిలి ఫలితం కలదు. ఓకేనా! 

- సెలెక్టెడ్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al