By Village Missionary Movement
Saturday, 30-Dec-2023దిన ధ్యానము(Telugu) 30.12.2023
అంశం:- కృతజ్ఞత గల హృదయం
"క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి" - కొలస్సీయులకు 3:15
వియత్నంలో జరిగిన యుద్ధంలో ఒక సైన్యపు నాయకుడు తన కింద పనిచేస్తున్న ఒక సైనికుడ్ని కాపాడుటకు ప్రయత్నించి ఆయన గాయపడి అదే స్థలములో మరణించవలసి వచ్చింది. దాని గురించి తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వబడింది. వాళ్ళు ఆయనకు జ్ఞాపకార్థ కూడికను ఏర్పరిచారు. ఆ కూడికలో అనేకులు వచ్చి ఉన్నారు కాపాడుబడిన యుద్ధ వీరుడు కూడా పిలువబడి ఉన్నాడు. ఆయన చాలా ఆలస్యంగా బాగా త్రాగేసి వచ్చి అక్కడ ఉన్న ఆహారములను అనాగరికతతో శ్రద్ధ లేకుండా తిని తనను కాపాడిన నాయకుడు తన తరఫున ఎలాంటి కృతజ్ఞత కూడా చెల్లించలేదు. అది మాత్రమే కాదు తిన్న వెంటనే తాను పిలవబడిన ఆ కుటుంబమునకు కొంచెం కృతజ్ఞత కూడా చెప్పకుండా స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన విడిచిపెట్టి వెళ్లిన వెంటనే ఆ నాయకుడి యొక్క తల్లి కన్నీరు కారుస్తూ ఇలాంటి కృతజ్ఞతలు లేని మనిషి కొరక నా కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చారు అని గట్టిగా ఏడ్చారు.
ఇలానే బైబిల్లో కూడా కృతజ్ఞతలు లేని మనుషుల గురించి రాయబడి ఉంది. రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువు ఓ గ్రామంలో ప్రవేశించినప్పుడు కుష్టి రోగము గల మనుషులు పదిమంది అయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలబడి ప్రభువా మమ్మల్ని కరుణింపమని కేక వేశారు. యేసు ఆ పదిమందికి స్వస్థత దయచేసి తాము స్వస్థపడిన దానిని ఆ యాజకులు వద్ద చూపించుకొమని యేసు ప్రభువు చెప్పినప్పుడు స్వస్థత పొందుకున్న ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి యేసయ్యకు కృతజ్ఞత చెల్లించుటకు ఏసుప్రభును కలిశాడు. అప్పుడు ఏసుప్రభు స్వస్థపరచబడిన వారు పదిమంది కదా మిగిలిన 9 మంది ఎక్కడ అని అడిగారు. అవును ప్రభువు మన యొద్ద నుండి కృతజ్ఞత గల హృదయాన్ని ఎదురుచూస్తున్నారు.
ప్రియమైన వారలారా! సంవత్సరం యొక్క చివరి దినాల్లో ఉన్న మనము ఎంత మంది కృతజ్ఞత గల హృదయము కలిగి ఉన్నాం. ఈ సంవత్సరము ప్రారంభంలో మనతో పరుగులు ప్రారంభించిన వారు అనేకులు ఈరోజు మనతో లేరు కానీ ఈ దినం వరకు ప్రభువు మనలను సజీవుల లెక్కలో ఉంచిన దాన్నిబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించారా? సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్ళాలి అని ఆలోచించిన మనము చివరి దినాలలో దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా గడపాలని ప్రణాళిక వేస్తున్నామా? ఎన్నో రోగాల నుండి సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించి ఈ క్షణం వరకు కాపాడుతూ వస్తున్న యేసయ్యకు మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయ!
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:-
తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రం జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250