Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.12.2023
Share:

By Village Missionary Movement

Friday, 29-Dec-2023

దిన ధ్యానము(Telugu) 29.12.2023

 

అంశం:- పరుగుల పందెము

 

"పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి" - 1 కోరింథీయులకు 9:24

 

ఉక్రెయిన దేశానికి చెందిన ఆటగాళ్లు లారీసా లేటినా 18 ఒలింపిక్ పథకములను పొందింది. 1956,1960,1964 ఆమె పాల్గొని పథకాలు పొందుకున్నది. తర్వాత 2012లో లండన్ లో 4200 మీటర్ల ఈతల పందెంలో మైఖేల్పల్స్ తన19వ బంగారు పథకమును పొందుకొని ఒలింపిక్ పోటీలో ఇతవరకు 48 సంవత్సరాల ఉండిన చరిత్రను అధిగమించారు. చరిత్రలో లారీసా మరుగు పడిపోయింది అనే ఇంటర్నేషనల్ జమున స్టిక్స్ అనే పత్రిక ఈ సందేశాన్ని వేసింది. అవును కొత్త సాధనలు వచ్చేటప్పుడు పాత కార్యాలు అధిగమించబడుతున్నాయి. 

 

కొన్ని సమయాల్లో కఠిన ప్రయాస మరుగుపడి పోతుంది అని అపోస్తులుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లు నశించిపోతున్న పథకముల కొరకు వాళ్ల శరీరమును కఠినముగా క్రమపరచి తరిఫీదిస్తున్నారు. అయినప్పటికీ వారి యొక్క టాలెంట్లు వాళ్ళు పొందుకున్న పథకాలు అనేక సందర్భాల్లో మరుగుపడిపోతున్నాయి. లోకములో నశించిపోతున్న ఒక పథకము కొరకు ఆటగాళ్లు తమ తమ శరీర అవయవాలను అంతగా కట్టడ చేసి ప్రయాస పడుతున్నారు. బైబిల్లో చూసేటప్పుడు వాడబారని జీవ కిరీటము అనే బహుమానముగా మన ముందు ఉంచబడింది అని రాయబడింది. కాబట్టి మన పరుగులు మన ప్రయాసలు చాలా ప్రాముఖ్యమైనది అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. 

 

క్రీస్తునందు ప్రియమైన వారలారా! పాత సంవత్సరం ముగించి మనం ఒక కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాము. అదే సంవత్సరంలో ఇప్పుడు మన పరిగెత్తిన మన ఆత్మీయ పరుగులో పరలోకం వెళ్లే వరకు ఎడతెగకగా ముందుకు వెళుతూ ఉండాలి కాని పరిశుద్ధ బైబిల్ చెబుతుంది అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాసేటప్పుడు మీరు పొందుకున్నట్లు పరిగెత్తుడి అని సలహా ఇస్తున్నారు. మన పందెపు బహుమానమును కోల్పోకుండా శ్రద్ధ కలిగి యేసయ్య వైపు పరిగెత్తుదాం. ఎందుకు అంటే మీ పరుగును ప్రయాసను మర్చిపోవుటకు మన దేవుడు ఆనీతి గల దేవుడు కాడు. వచ్చే నూతన సంవత్సరంలో మీ పరుగును చక్కగా కొనసాగించుటకు సర్వశక్తి గల దేవుడు కృప దయచేయును గాక! ఆమెన్. 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం:-

మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al