By Village Missionary Movement
Thursday, 28-Dec-2023దిన ధ్యానము(Telugu) 28.12.2023
అంశం:- దీవెనకరమైన సలహా
"కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును" - జెకర్యా 4:10
గొప్ప ధనవంతుడు ఒకాయన అనేక దినములుగా ఒక కల కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే ఒక కార్ కంపెనీ ప్రారంభించాలి. దాంట్లో ఒక మంచి కారును తయారు చేయాలి అనేది తన యొక్క కల. అనుకున్నట్లుగానే కార్ ను తయారు చేయుటకు కంపెనీ రూపొందించబడింది. ఆ కారును పరిచయం చేయాలి అని అనేకులు ఆహ్వానం ఇచ్చారు. అనేకమంది ప్రజలు గుమ్మకిడి ఉండగా ఆ ప్రాముఖ్యమైన సమయంలో ఆ కొత్త కారును గదిలో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక సమస్య ఏర్పడింది. కట్టడం యొక్క ద్వారము కారు కంటే ఐదు సెంటీమీటర్లు తక్కువగా ఉంది కాబట్టి లోపట నుండి కారు బయటకు రాలేదు. దాన్ని చూచిన ప్రజలందరూ ఆలస్యం అవుతుంది అని సనుక్కోవడం ప్రారంభించారు. మరికొందరు గట్టిగా కూడా చెప్పడం ప్రారంభించారు. దాన్ని గమనించిన కంపెనీ యొక్క కాపలాదారుడు కారులో ఉన్న టైర్ల గాలి తీసేస్తే కారు యొక్క ఎత్తు తక్కువ అయిపోతుంది కాబట్టి కారు బయటకు వచ్చిన తర్వాత కారు టైర్ లో గాలి నింపుకోవచ్చు అన్నాడు. ఆ కాపుల దారుని యొక్క మాట విని అలా చేశారు.
ఆ ధనవంతుడు సంతోషంతో తన మనసు నిండిపోయింది. కారు పరిచయం చేయబడింది.
బైబిల్లో కూడా సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను కుష్టి రోగం వలన చాలా బాధలు పడ్డాడు. ఆయన ఇంటిలో ఇశ్రాయేలీయుల నుండి తీసుకుని రాబడిన ఆ బానిస అయిన చిన్నది ఉండేది. ఆ చిన్నది తన యజమానురాలను చూసి నా యజమానుడు సమరయలో గల నా ప్రవక్త వద్దకు వెళ్లిన యెడల బాగుపడును ఆయన ఈయన యొక్క కుష్టు రోగాన్ని బాగు చేస్తాడు అని చెప్పింది.
నైమాను యొక్క పనివాడు స్నానం చేయండి అప్పుడు మీకున్నటువంటి రోగం నుండి స్వస్థత పొందుకుంటారు అని చెప్పాడు. అయితే నైమాను సైన్యాధిపతి అయినప్పటికీ పనివాడు యొక్క మాట విని ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఇలాంటి సలహాల వలన నయమాను స్వస్థపరచబడ్డాడు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మన జీవితంలో కూడా ఈ సమస్యకు పరిహారమే లేదు అని ఆలోచించవచ్చు. వీరి ద్వారా నా సమస్య పరిష్కరించబడుతుందా? అని మనము వారిని అల్పముగా తలంచ కూడదు. వారి వలన కూడా మన సమస్యల నుండి పరిష్కారము దొరకవచ్చు. మనకు మంచి ఆలోచన వచ్చేటప్పుడు దాని కొరకు చెప్పే వ్యక్తి ఎవరైనాను ఆ సలహా చొప్పున మనము కార్యాన్ని జరిపించేటప్పుడు మన కార్యము విజయవంతం అవుతుంది. అందుకే మనతో ఉన్న వ్యక్తులను మన చుట్టూ ఉన్న ఎవరితో కూడా అల్పమైన వారిగా చూడకూడదు. మనకొరకు సిలువలో మరణించిన యేసు మనలను అశ్రద్ధ చేసియున్న యెడల మన కొరకు ఆయన సిలువలో మరణించి ఉంటారా?
- సిస్టర్. మరియా మాల్ రూతు
ప్రార్థన అంశం:-
ప్రార్థన గుంపు నాయకుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250