By Village Missionary Movement
Monday, 25-Dec-2023దిన ధ్యానము(Telugu) 25.12.2023
అంశం:- సమాధానకరమైన క్రిస్మస్
"సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను" - లూకా 2:14
ఏసుక్రీస్తు ఈ భూలోకంలో జన్మించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం కలదు అది ఈ లోకానికి సమాధానమిచ్చుటకే. పాపములో బ్రతుకుతున్న మనకోసం సమాధానమిచ్చుటకు ఏసు ఇవ్వబోతున్న గొప్ప బహుమానము సమాధానకరమైన జీవితం.
మనుషుల్లో అందరూ పరలోకానికి వెళ్తాము చెప్పుట వలన ఎలాంటి ప్రయోజనము జరగదు. పరలోకము మనం అనుకున్నట్లు సాధారణమైన స్థలము కాదు అది యేసయ్య నివసిస్తున్న గొప్ప మహోన్నతమైన స్థలము. యేసు పరిశుద్ధుడు పాపము లేని వాడు కాబట్టి ఆయనను వెంబడించే వారు ఆయనతో ఉంటున్న వారు కూడా అలాగే ఉండాలి. మన ఇంటిని శుభ్రంగా పెట్టుకొవాలి అని ఆశిస్తూ ఉంటాం. ఇంటి మధ్యలో చెత్త వేసి సహించుకొని జీవించుము అలానే మన యేసు ప్రభు కూడా ఆ ఇంటిలో అనేక నివాసములు కలవు కానీ అది పాపులకు కాదు పాపక్షమాపణ పొందిన వారికి మాత్రమే. అలాంటి స్థలమునకు మిమ్ములను మమ్మల్ని తీసుకుని వెళ్ళుటకు వచ్చిన వ్యక్తి యేసు ప్రభువు.
క్రిస్మస్ అన్నది ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గ్రహింపజేసే ఒక దినం. ఆయన వచ్చినా ఉద్దేశాన్ని సంపూర్ణముగా గ్రహించి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఇతరులకు ఈ సువార్తను ప్రకటించాలి. యేసు జన్మించిన వెంటనే ఈ లోకంలోనికి వచ్చిన మొదటి సందేశం ఏమిటి అంటే మీకు సమాధానము కలుగును గాక అని. గొర్రెల కాపరులు దూతలను చూచి భయపడినప్పుడు వాళ్లతో దూత చెప్పిన మాట మీకు సమాధానం కలుగును గాక! యేసు ఈ లోకంలో జన్మించిన వెంటనే రెండు కార్యాలు జరిగాయి ఒకటి చీకటీలో వున్న ప్రజలు వెలుగు చూడగలిగారు. రెండు మీకు సమాధానం కలుగును గాక అనే సందేశము పరలోకము నుండి భూలోకానికి వచ్చింది.
ప్రియమైన వారలారా! హృదయంలో యేసు ఏ దినము జన్మించి ఉన్నారో ఆ దినమే నిజమైన క్రిస్మస్ దినము. ఏసుక్రీస్తు మన హృదయములో జన్మించిన ఎడల నేను కూడా పరలోకానికి వెళ్తాను అని చెప్పడం వలన ఎంత మాత్రం ప్రయోజనం లేదు. పరలోకంలో పాపము ఏ విధముగా లోపలికి ప్రవేశించలేదొ అలానే పాప క్షమాపణ పొందని వారు కూడా పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి పాపపు చీకట్లో ఉంటున్నవారు యేసును తమ హృదయములో జన్మించుటకు చోటిస్తేనే గొప్ప వెలుగును చూడగలరు. అలాంటి వెలుగును చూసినవారు మాత్రమే గొప్ప సమాధానాన్ని అనుభవించగలరు. సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు.
- బ్రదర్. శంకర్ రాజు గారు
ప్రార్థన అంశం:-
మన ఫీల్డ్ లకు అవసరమైన 50 ద్విచక్ర వాహనములు కొనవలసి ఉన్నది కనుక సహాయం చేసే వారు లేచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250