Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.12.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 24-Dec-2023

దిన ధ్యానము(Telugu) 24.12.2023 (Kids Special)

 

అంశం:- క్రిస్మస్ వచ్చేసింది

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును" - మత్తయి 25:40

 

హాయ్ పిల్లలు డిసెంబర్ వస్తేనే మన ఆలోచనలలో స్టోర్ అయ్యి ఉండేది క్రిస్మసే. హాఫ్ ఇయర్ లి ఎగ్జామ్ అదంతా తరువాతే కారణం కొత్త డ్రెస్సు, స్వీట్లు, కేకులు అన్ని దొరుకుతాయి. ప్రోగ్రాములు, డాన్స్లు, డ్రామాలు అని జాలిగా ఉంటది కదా. సరే ఇప్పుడు ఒక క్రిస్మస్ స్టోరీ విందామా? 

 

జాయ్ అనే చిన్న అమ్మాయి ఉంది. ఆమె ఇంట్లో ఒక్కరితె కుమార్తె కాబట్టి చక్కగా ముద్దుగా పెరిగింది. నాన్నను ఏమి అడిగినా కొనిస్తారు నాకు కావాల్సినవి దొరుకుతున్నాయి కదా మిగిలిన వారు ఎలా వెళ్తే నాకేంటి అని ఆలోచించకుండా వాళ్ల వీధిలో గల పెదలకు సహాయం చేస్తూ ఉండేది. కష్టపడుతున్న వారిని చూస్తే వెంటనే కనికరపడి నాన్నకు చెప్పి వెంటనే సాయం చేస్తుంది. సూపర్ కాదు! మీరు కూడా సాయం చేస్తారా? క్రిస్మస్ కి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుందాం రా జాయ్ మార్కెట్ కి వెళ్దాం అని నాన్న చెప్పిన వెంటనే చాలా సంతోషంతో బయలుదేరింది జాయ్. వస్తువులన్నీ కొనేసి ఒక షాప్ లో జ్యూస్ తాగుతున్నారు. ఆ షాప్ లో ఒక చిన్న బాలుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ బాలుడిని చూసి ఏ రాజు ఇటురా అని పిలిచింది జాయ్. ఎవరమ్మా అని నాన్న అడిగిన వెంటనే నాతోపాటు నా స్కూల్లో చదువుతున్న అబ్బాయి అని చెప్పింది. వెంటనే జాయ్ రాజు ఏమైంది స్కూల్ కి రావడం లేదే అని అడిగింది. వెంటనే రాజు కన్నీరు కారుస్తూ మా నాన్నకు జరిగిన ప్రమాదంలో కాలు తీసేశారు కాబట్టి ఇంటికి రాబడి లేదు అందుకని నేను ఇలా సంపాదించి నా ఇంటిలో వారిని పోషిస్తున్నాను అని చెప్పిన వెంటనే జాయికి చాలా దుఃఖము కలిగింది. వెంటనే జాయ్ తన నాన్నతో నాన్న నాకు క్రిస్మస్ డ్రెస్ వద్దు. రాజు వాళ్ల అమ్మకు నాన్నకు డ్రెస్ కొనివ్వండి అని అడిగింది జాయ్. జాయ్ కి ఉన్న కనికరాన్ని చూసి వాళ్ళ నాన్న చాలా సంతోషించారు. క్రిస్మస్ దినాన రాజు వాళ్ళ ఇంటికి వెళ్లి మంచి భోజనాన్ని వాళ్ళకి ఇచ్చి కొత్త బట్టలు బహుమానముగా ఇచ్చారు. వాళ్ళు దానిని చూసి వారు పొందుకున్న సంతోషానికి ఎల్లలు లేవు. అది మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మదిన సందేశాన్ని ఆయన ప్రేమను చెప్పేటప్పుడు వాళ్ళ హృదయంలో యేసయ్య ఆ దినము జన్మించారు. అంతగా వారికి సంతోషం అనిపించింది. రాజు వాళ్ళ నాన్నకు పరికరాలు గల కాలు బిగించుటకు నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను అన్నారు జాయ్ వాళ్ళ నాన్న. జాయ్ కి ఈ క్రిస్మస్ అర్థవంతమైన క్రిస్మస్గా మారింది. హలో పిల్లలు క్రీస్తు మనలో జన్మించుటయే క్రిస్మస్ కాబట్టి దాన్ని ఇతరులకు ప్రకటించడం మాత్రమే కాదు మన క్రియల ద్వారా దాన్ని నిరూపించాలి. సరేనా పిల్లలు! 

- శ్రీమతి. బ్యూలా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al