By Village Missionary Movement
Saturday, 23-Dec-2023దిన ధ్యానము(Telugu) 23.12.2023
అంశం:- నిరీక్షణ నక్షత్రం
"నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది" - యోహాను 1:9
పరిశుద్ధ బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన రెండింటికి మధ్యలో సుమారుగా 400 సంవత్సరాలు
మౌనపు సంవత్సరాలు అని పిలవబడుతున్నాయి. ఈ చీకటి సంవత్సరాల తర్వాత మానవజాతికి వెలుగులోకి వచ్చిన ఏసుక్రీస్తు యొక్క చరిత్రతో ఈ లోకపు చరిత్ర మొదలవుతుంది. ఈ దినమున క్రీస్తు జన్మను గ్రహించిన వారు ఏమి చేశారు అనేదాన్ని బైబిల్లో నుంచి ధ్యానిద్దాం.
హెరోదు రాజు:- ఏసుక్రీస్తు జన్మ సందేశం విన్న వెంటనే కలత చెందాడు. తనకు పోటీదారుడుగా వచ్చిన రాజును గురించి కార్యాలు అడిగి తెలుసుకున్నాడు కానీ క్రీస్తు ప్రభు యొక్క జన్మ ఆయనకు భయాన్ని కలిగించేది కాదు మారుగా భయాన్ని తీసివేయగలిగినది అనే దాన్ని రాజు మర్చిపోయాడు. ఈ సందేశము సమస్త జనులకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. సువార్త అనేది ఆయన ద్వారానే ఈ లోకానికి రక్షణ వస్తుంది అనేదాన్ని గ్రహింపని రాజుగా ఆయన పని చేశాడు.
జ్ఞానులు:- జ్ఞానులు ప్రయాణాన్ని ఒక విశ్వాసపు ప్రయాణంగా పోల్చి చెప్పవచ్చు. వాళ్లకు మంచి గురి ఉన్నది. రాజాధిరాజు దర్శించాలి అన్నదే వారి గురి దాంతో మంచి ఉద్దేశం కూడా ఉండేది. ఆ ఉద్దేశం గల గురి క్రీస్తే. ఆయనను వెతికారు కనుగొన్నారు నమస్కరించారు కానుకలు ఇచ్చారు. మన జీవితంలో కూడా మన జీవితపు ఉద్దేశం గురి మనస్తత్వం తగ్గింప కలిగినదిగా ఉన్నదా? ఈ లోకపు ప్రయాణం మనలను రాజాధిరాజు వద్దకు నడిపిస్తున్నదా? నిరీక్షణతో ముందుకు సాగుతున్నామా?
నక్షత్రం:- జ్ఞానులను నడిపించుటకు వచ్చిన నక్షత్రమును సువార్తికుడు అని చెప్పవచ్చు. ఈ నక్షత్రము క్రమముగా సరియైన స్థలమునకు వాళ్లను తీసుకుని వెళ్ళింది. చీకటి లోకమునకు వచ్చిన క్రీస్తును వారు కనుగొనేటట్లు చేసింది.
ప్రధానయాజకులు మరియు పరిసయ్యులు:- వీళ్లు ఏసుక్రీస్తు జన్మ గురించి చక్కగా వివరణ ఇచ్చారు కానీ ఎరుషలేమునకు పక్కన ఉన్న బెత్లెహేమునకు వెళ్లి ఆయనను చూడాలి అని ఆలోచన వారికి లేదు. మనము కూడా బైబిల్లో గల జీవపు మాటలను వినే వారిగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారం నడుచుకొనుటకు ప్రయత్నము చేయనీయడల అది మన జీవితంలో ఎలాంటి దీవెనలను తీసుకుని రాలేదు.
అవును ప్రియమైన వారలారా కళ్ళతో జీవిస్తున్న ప్రజలకు సువార్తను ప్రకటించే వారముగా విశ్వాస పరుగులో ధైర్యముతో జీవించుటకు ఈ దినం మనలను మన సమర్పించుకుందాం.
- శ్రీమతి. జబకని శేఖర్ గారు
ప్రార్థన అంశం:-
క్రిస్మస్ దినాలలో దర్శింపబడబోతున్న ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు ప్రేమను ఎరిగేటట్ల ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250