Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.12.2023
Share:

By Village Missionary Movement

Friday, 22-Dec-2023

దిన ధ్యానము(Telugu) 22.12.2023

 

అంశం:- అర్థవంతమైన క్రిస్మస్

 

“వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి” - లూకా 2:13

 

రాణి తన ఇంట్లో క్రిస్మస్ చెట్టు పెట్టి ఆ చిన్న పశువుల పాకను వాళ్ళు కార్ షెడ్ లో అలంకరణ చేసి పెట్టింది. ఆ మార్గం గుండా వెళ్లే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి దాని ముందు నిలబడి చూసేవారు. దాన్ని రాణి చూస్తే వెంటనే గేటు తెరిచి వాళ్లకు ఏసుప్రభు యొక్క ప్రేమను చెబుతూ స్వీట్లు ఇచ్చి పంపించేది. అలానే ప్రతి క్రిస్మస్ రోజున ఇద్దరికైనా బాప్తిస్మిచ్చేటట్లు ఆ సంవత్సరం అంతా వారిని దేవుని వద్దకు నడిపించి చర్చికి తీసుకు వెళ్తూ ఉండేది. వీటన్నిటిని చూచిన ఆమె యొక్క స్నేహితురాలు దారని ఆశ్చర్యంగా చూస్తుండగా వెంటనే ఆమె యొద్ద క్రీస్తు పుట్టినప్పుడు పరలోకము ఎలా సంతోషించింది ఆ పరలోక సైన్యం సంతోషాన్ని లోకానికి ప్రకటించారు ఈరోజు అనేక హృదయలలో యేసు జన్మించడం వలన పరలోకం సంతోషించాలి కాబట్టి చిన్న ప్రయత్నం చేస్తున్నాను అన్నది రాణి. 

 

ఏసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడప్పుడు దీనత్వముగా పశువుల పాకలో జన్మించిన సందేశాన్ని ప్రకటించుటకు పరలోక సైన్యమే దిగివచ్చి ప్రకటించి సంతోషించింది. పరలోకపు సైన్యము సంతోషముతో కాపరులను దర్శించింది. ఆ కాపర్లు దానిని విన్న అందరూ ఆశ్చర్యపడ్డారు మరియు అనేకులు దాన్ని చూచి ఉంటారు కూడా మరియు నక్షత్రం జ్ఞానులను తీసుకుని వచ్చింది. వాళ్లు తమ జ్ఞానము ఘనత అన్నింటిని పక్కనపెట్టి సాష్టాంగ పడి నమస్కరించారు. 

 

మనం పొందుకున్న వెలుగును మన సంఘంలో పెట్టి వెలుగు ఇచ్చేటట్లు చేస్తున్నామా లేదా ఆర్పి వేసామా అని ఆలోచిద్దాం. ఎందుకంటే ఇంకనూ క్రీస్తును ఎరగనివారు మన చుట్టూ అనేకమంది ఉన్నారు. మనము మాత్రమే దేవుని పూజిస్తే చాలు అనుకుంటే పరలోకము దానితో సంతోషించుదు. 

 

ప్రియమైన వారలారా! పాపపు శాపపు చీకట్లో జీవిస్తున్న ప్రజలకు క్రీస్తు అనే వెలుగును అందిద్దాం. చీకటిలో నడుస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు అని యెషయా గ్రంధం 9:2 లో రాయబడినట్లు పరలోక సంతోషమైన దీపాన్ని వెలిగిద్దాం. అది అర్థవంతమైన క్రిస్మస్. 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన పార్ట్ టైం మిషనరీలు మరియు వారి ద్వారా దర్శింపబడుతున్న గ్రామాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet