Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.12.2023
Share:

By Village Missionary Movement

Thursday, 21-Dec-2023

దిన ధ్యానము(Telugu) 21.12.2023

 

అంశం:- క్రిస్మస్ బహుమానము

 

"కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి" - అపో.కార్యములు 20:31

 

నాన్న నాతో చదువుతున్న సురేష్ చాలా పేదవాడు నాన్నా. నేను వాడికి క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తాను నాన్న అని తన తండ్రి వద్ద పర్మిషన్ అడిగాడు డేవిడ్. నిన్నే కదారా డ్రెస్ తీసుకున్నాం అప్పుడే చెప్పి ఉంటే మరొక డ్రెస్ తీసుకునేవారము కదా అని అన్నారు నాన్న. నాకు తీసిన రెండింటిలో ఒక దానిని అతనికి ఇచ్చేస్తాను అని చెప్పగానే నాన్న ఆ డ్రెస్ యొక్క రేటు ఎంతో తెలుసా నీకు అని కోపంతో అరిచారు నాన్న. పేదవాడికి ఇచ్చుట యేసయ్యకు ఇచ్చినట్లే నాన్న. మంచి బట్టలు ఇవ్వాలి నాన్న అని ఆ బాబు చెబుతూ ఉంటే కళ్ళల్లో కన్నీరు కారింది ఆ తండ్రికి. 

 

రెండు డ్రెస్సుల్లో ఒకదాన్ని ఇచ్చేసి న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి వేసుకొన్నా డ్రెస్ నే వేసుకోవాలి వేరే బట్టలు తీయను అని చెప్పారు నాన్న. అందుకు థాంక్స్ నాన్న అని సంతోషంతో డేవిడ్ చెప్పాడు. కొత్త బట్టలు ధరించాలని ఆశిస్తున్న తన కుమారుడా ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచనలో ఉండిపోయాడు డేనియల్. క్రిస్మస్ అంటే ఏమిటి మహోన్నతమైన దేవుడు అతని కుమారుడిని ఈ లోకమునకు బహుమానంగా పంపించడమే. ఇది చాలా గొప్ప బహుమానం. 

 

వివాహమునకు మునుపు ఒకవేళ గర్వవతి అయితే యూదా సమాజం వారు రాళ్లు రువ్వి చంపుతారు అని సమాజము గురించి తెలిసి ఉండినప్పటికీ గాబ్రియేలు దూత ద్వారా సందేశం పొందుకున్న మరియ దేవుని కుమారుని కనుటకు తన్ను తాను సమర్పించుకున్నారు.  

 

జ్ఞానులకు నక్షత్రం మార్గాన్ని చూపిస్తే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి యేసయ్యను చూశారు. జన్మించినవాడు రాజాధిరాజు కాబట్టి దాన్ని గుర్తించే విధంగా బంగారమును ఆయన లోక ప్రజల కొరకు బలి అవుతారు అని చెప్పుట కొరకు బోలమును, ఆయన దైవత్వం లోకమంతా కూడా పరిమళిస్తుంది అని చాటుటకు సాంబ్రాణిని కానుకలుగా సమర్పించారు. ఈ వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి. 

 

ఈ దినము మనము క్రిస్మస్ ని ఎలా జరుపుకుంటున్నాం? కొత్త బట్టలు ధరించుకొని మంచిగా భోజనాలు వండుకొని మన కుటుంబాలకు స్వీట్లు పంపిస్తున్నాం. కానీ మనం పేదవాళ్ల గురించి ఆలోచిస్తున్నామా మిషనరీలకు బహుమానాలు పంపించి వాళ్ల సంతోషాలలో పాల్గొంటామా? మనకు ఉన్న దానిలో తీసి కష్టపడుతున్న ప్రజలకు ఇచ్చి త్యాగపూరితమైన మనసుతో క్రిస్మస్ జరుపుకుందాం. తన ప్రియ కుమారుడ్ని లోకానికి పంపించిన పరమ తండ్రి యొక్క త్యాగం ఎంత గొప్పదో అనేదాన్ని మనం గ్రహించిన ఎడల మనము త్యాగము చేయకుండా క్రిస్మస్ ను జరుపుకోలేము. 

- శ్రీమతి. వనజా పాల్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

7000 మిషనరీలు లక్ష గ్రామాలు అనే దర్శనానికి చేరుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betasus casibom maximcasino pashagaming pashagaming maximcasino pashagaming superbetin superbetin matbet matbet giriş