Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.12.2023
Share:

By Village Missionary Movement

Sunday, 17-Dec-2023

దిన ధ్యానము(Telugu) 17.12.2023

 

అంశం:- ఏంజెల్స్

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను" - లూకా 2:10

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా! అవును ఇది క్రిస్మస్ దినాలు కదా. క్రిస్మస్ అంటే ఏమిటి? 2,000 సంవత్సరాలకు మునుపు ఈ భూలోకంలో బాలుడుగా జన్మించిన యేసుక్రీస్తు మన పాపమును క్షమించుటకు మనల్ని రక్షించుటకు ఆయన జన్మించిన దినాన్నే క్రిస్మస్ అని మనం పాటిస్తున్నాం. క్రిస్మస్ అంటే కొత్త డ్రెస్, స్వీట్లు, క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్ ఇలా చాలా జాలిగా ఉంటారు కదా. 

 

మీలాగే జెమ్మి అనే పాప ఉండేది. ఆమె అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ ఈ క్రిస్మస్కు నాకు ఏంజెల్ లాంటి డ్రెస్సు మరియు వింగ్స్, క్రౌన్ అన్ని కొనేసి ఇవ్వండి నేను కూడా ఏంజెల్ లాగా మెరిసిపోవాలి అన్నది. వెంటనే అమ్మ జెమ్మి ఏంజెల్ గురించి నీకు ఏమైనా తెలుసా అని అడిగింది. వెంటనే జెమ్మి అలా చెప్పుకోవడానికి ఏమి చేశారు అని అన్నది. వెంటనే అమ్మ ఏంజెల్ గురించి చెప్పడం ప్రారంభించారు. 

 

 ఆది దినాలలో గొర్రెల కాస్తున్న కాపరులను ఎవరు పట్టించుకునేవారు కాదు. తిరస్కరించబడినవారిగా సమాజంలో త్రోసి వేయబడిన వారిగా ఉండేవారు. వాళ్లు చలిలో తమ మందలను కాస్తూ పొలములో ఉంటుండగా ఆ కాలంలోనే ఏసుక్రీస్తు బెత్లెహేములో జన్మించారు. ఏంజెల్స్ రాజుల భవనానికి లేదా ఆస్తులు గల వారి దగ్గరకు వెళ్లకుండా యేసయ్య జన్మించిన మంచి సువార్తను, సందేశమును పొలములో ఉన్న గొర్రెల కాపరులకు ప్రకటించారు. మిమ్మల్ని రక్షించుటకు మిమ్మల్ని కాపాడుటకు ఒక రక్షకుడు పుట్టియున్నాడు అని చెప్పారు. వెంటనే ఆ గొర్రెల కాపరులు సంతోషముతో తిరస్కరించబడిన మనలను రక్షించుటకు ప్రేమించుటకు ఒకరు జన్మించినారా అని అప్పుడే యేసుని చూచుటకు బయలుదేరారు. చీకటిలో ఉండిన వారికి యేసు అనే వెలుగు కలిగేటట్లు ఏంజెల్స్ చేశారు. ఏంజల్స్ వెళ్లి కాపర్లకు చెప్పకుండా ఉండి ఉంటే వారికి తెలిసి ఉండేది కాదు కాబట్టి ఏంజెల్స్ వలె డ్రెస్ వేసుకుని వింగ్స్ పెట్టుకుని క్రౌన్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. నీవు కూడా వెళ్లి యేసయ్య గురించి తెలియని వారికి చెప్పాలి ఓకేనా! అని అన్నారు. వెంటనే జెమ్మి తమ అమ్మతో ఈ క్రిస్మస్కు యేసయ్య గురించి అందరికీ చెప్పి వాళ్లకు సహాయం చేసి అర్ధవంతమైన క్రిస్మస్ను నేను కొనియాడతాను, యేసయ్యను సంతోషపెడతాను అన్నారు. ఏంటి పిల్లలు మరి మీరు కూడా జమ్మి వలే మంచి తీర్మానం తీసుకుంటారా? 

- శ్రీమతి. సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al