Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.12.2023
Share:

By Village Missionary Movement

Saturday, 16-Dec-2023

దిన ధ్యానము(Telugu) 16.12.2023

 

అంశం:- క్రిస్మస్ దీవి

 

"యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక" - కీర్తనలు 97:1

 

ఆస్ట్రేలియా తూర్పు భాగంలో గల దీవిలో నివసించే పీతలు ఎర్ర పీతలు అని పిలవబడతాయి. ఇది అడవిలో నివసిస్తూ ఉంటాయి. వర్షాకాల ప్రారంభంలో ఇది చాలా మైళ్ళు దూరం ప్రయాణం చేసి ఆ సముద్రపు ఒడ్డున చేరుకొనుటకు ప్రయాణం చేస్తుంటాయి. ప్రమాదకరమైన ప్రయాణమే పక్షులు, మనుషులు, రోడ్లపైన వెళ్లే వాహనాలు వీటి వలన వాటికి ప్రాణపాయములు ఇలా అనేక ప్రమాదములు దాటుతు తమ వంశమును అభివృద్ధి చేయుటకు కాపాడుటకు ఈ పీతలు పోరాడుతున్నాయి. క్రిస్మస్ దినమున ఈ ఎర్ర పీతలు తన వంశమును అభివృద్ధి చేసుకొని విస్తరింపజేస్తున్నాయి. 1643వ సంవత్సరములో బ్రిటన్ కి చెందిన రాయల్ మేరీ అనే నావ యొక్క కెప్టెన్ విలియం మైనస్ అనే వ్యక్తి ఈ దీవిని దాటి వెళ్ళేటప్పుడు దీనికి క్రిస్మస్ దీవి అని పేరు పెట్టాడు. ఈ ఎర్రటి పీతలు పోరాడుతున్న ఈ స్థలాన్ని చేరుకుని తమ వంశమును కాపాడుకొనుటకు అభివృద్ధి చేయడానికి ఈ దీవిని వాడుకుంటున్నాయి. 

 

బైబిల్లో కూడా మోషే అహరోను ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వ జీవితం నుండి రక్షించి కానానుకు తీసుకుని వెలుటకు దానిని సొంతము చేసుకొనుటకు చాలా ప్రయాసపడ్డారు. అలానే ఎస్తేరు రాజు దగ్గర తన సొంత ప్రజలు రక్షింపబడుటకు హామాను యొక్క కుయుక్తిగల కార్యముల నుండి ఆ ప్రజలను కాపాడుటకు తీసుకున్న ప్రయాసలు చాలా ఎక్కువ. ఉపవాసము చేసి రాజు యొక్క సన్నిధిలో మాట్లాడుతూ తమ జాతి ప్రజలకు వచ్చే కీడు నుండి కాపాడారు. కన్య అయిన మరియకు జన్మించిన ప్రభువైన ఏసుక్రీస్తు పాపములోను, చీకటిలోనూ బానిసత్వంలో జీవిస్తున్న ప్రజలను కాపాడుటకు రక్షించుటకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. మన అందరి కొరకు జీవాన్ని ఇచ్చారు. 

 

అవును ప్రియమైన వారలారా! పాప లోకములో జీవిస్తూ మనలను రక్షించి క్రీస్తు మన కొరకే ఈ లోకానికి వచ్చారు. ఆయన త్యాగపూరితమైన ప్రేమను గ్రహించిన దినమే క్రిస్మస్. ఈ దినము కొత్త వస్త్రమును ధరించి మంచి ఆహారం వండుకొని మన కుటుంబమును సంతోషకరముగా మన హృదయం సంతోషించేటట్లు చేస్తున్నాం. మంచిదే కానీ ఆయనను సంతోషపెడుతున్నామా? ఏదైనా కార్యము చేసి ఉన్నామా? స్వీట్లను బహుమానాలను పంచుతున్న మనము మన యేసయ్య యొక్క ప్రేమను పంచుటకు సిద్ధంగా ఉన్నామా? ఏసుప్రభు యొక్క సువార్తను ఆయన మాటలకు ఎన్నో దీవులు వేచి ఉన్నాయి కానీ ఎన్ని నిజమైన కార్యాలు చరిత్రలో కలవు. తన వంశమును కాపాడుకొనుటకు తెలివి తక్కువ గల పీతలు కొన్ని మైళ్లు ప్రయాణం చేస్తే క్రీస్తును ఎరిగిన మనము ఎన్ని దీవులకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ దీవిలో ఉన్న ప్రజలను నిత్య నరకము నుండి కాపాడటం కొరకు ఏమి చేయబోతున్నాం. క్రీస్తు సువార్త అన్నిచోట్లకు విస్తరింపనివ్వండి భూమి అంతా ఆయన మహిమ చేత నింపబడనివ్వండి. రక్షణ సంతోషము హృదయాన్ని గృహాన్ని నింపేటట్లు చేద్దాం. హల్లెలూయ! 

- శ్రీమతి. మంజుల గారు 

 

ప్రార్థన అంశం:-

దేబోరా పరిచర్య కింద జరుగుతున్న పరిచర్య ద్వారా అనేకలు దర్శింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet