By Village Missionary Movement
Friday, 15-Dec-2023దిన ధ్యానము(Telugu) 15.12.2023
అంశం:- భూమియందు సమాధానము
"సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను" - లూకా 2:14
మరియొక క్రిస్మస్ కాలం వచ్చేసింది. క్రిస్మస్ గీతములను భక్తితోను లేదా భక్తి గ్రహింపు లేకుండా కూడా పాడవచ్చు. యేసునకు సత్రములో చోటు లేకుండా పోయింది. సత్రములో చోటు లేకుండా ఉన్న విధముగా మన హృదయాల్లో, మన గృహాల్లో ఏసుప్రభునకు చోటు లేకుండా ఉండవచ్చు. యేసయ్య జన్మించిన ఆ పశువుల పాక వలె మన హృదయాన్ని ఈ దినము ఇచ్చి ఆయనను ఇమ్మానియేల్ గా విశ్వాసముతో సంతోషముతో కొనియాడవచ్చు. కొందరు అన్య మతస్థులు పాటలతో కొనియాడుతు అర్థము లేని క్రిస్మస్ను చేస్తున్నారు. కొందరు శ్రమలు మధ్యలో కూడా క్రిస్మస్ దినాలను దుఃఖముతో ఆచరిస్తూ ఉంటారు.
కార్యాలు ఇలా ఉండగా ఈ దినములో ఎక్కడ చూడలేని విధముగా ఉగ్రవాదములు, వ్యతిరేకతలు, హత్యలు, యుద్ధాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు అని ఎక్కడ చూసినా కన్నీరు సమాధానములేని కార్యాలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సమాధానానికి కర్త కొత్తగా జన్మించిన యేసయ్య జన్మదినం మనం ఎలా కొనియాడాలి అనే దాన్ని యేసయ్య ఎదురుచూస్తున్నారో చూద్దాం.
మనుషుల పాపముల కొరకు తన విలువ కలిగిన రక్తాన్ని కార్చి దేవునికి మనుషునికి మధ్యన సమాధానం ఏర్పరచడానికి ఏసు ప్రభువు శరీరధారిగా వచ్చారు అన్నదే మొదటి క్రిస్మస్ సందేశం. (కొలస్సీయులకు రాసిన పత్రిక 1: 20)ఆయనే మన సమాధానం కర్త (ఎఫెసీయులకు 2: 14). ఈ సమాధానము మనకు భూమ్మీద ఉన్న సమస్త ప్రజలకు వాక్యాన్ని తెలియజేస్తుంది. ఈ సమాధానం పొందుకున్న వాళ్లే నిజమైన క్రైస్తవుడు. వారు మాత్రమే ఈ సమాధానం లేని ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా సమాధానంగా ఉండగలరు. ఇదే సువార్త యొక్క ప్రాముఖ్యమైన సందేశం. మీరు నిజముగా క్రైస్తవులా? మీ జవాబు అవును లేక వేరే సందేహం ఉంటే ఇప్పుడే ఆ సమాధానాన్ని పొందుకొనుటకు క్రిస్మస్ కు సిద్ధపడండి. అలాగైతే మొదటి క్రిస్మస్ దినమును దూతలు సైన్యముతో స్తుతించి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగజేసిన దేవుడు మీకు సమాధానము కలుగుజేస్తాడు. ఆమెన్!
- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు
ప్రార్థన అంశం:
మన క్యాంపస్లో ఉండి తర్ఫీదు పొందుతున్న మిషనరీల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250