Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.12.2023
Share:

By Village Missionary Movement

Thursday, 14-Dec-2023

దిన ధ్యానము(Telugu) 14.12.2023

 

అంశం:- నడిపించే తార

 

"వారు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను" - మత్తయి 2:9

 

క్రిస్మస్ వచ్చేసింది పండుగకు కరువు లేదు. ఇంటిని డెకరేషన్ చేయుటలో మొట్టమొదటిగా స్థానం స్టారే అవును చిన్నపిల్లల మొదలుకొని పెద్దలు వరకు అందరికి కూడా గుర్తుకు వచ్చేది నక్షత్రమే. ఈ స్టార్ ను కొనుక్కొని ఇంట్లో వేలాడాదీస్తే క్రిస్మస్ కొరకు ఉత్సాహము వచ్చేస్తుంది. దీని గురించిన అనేక కార్యాలు కలవు అయినా బైబిల్లో నుండి ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని ఈ దినము ధ్యానిద్దాం. 

 

మత్తయి సువార్త రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు జన్మించిన దినాలలో తూర్పుదిక్కు నుండి జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా జన్మించిన వాడు ఎక్కడ అని హెరోదు రాజు వద్ద అడుగుతున్నారు. ఇది ఆయనకు నచ్చలేదు. రాజుగా నేను ఉంటున్నాను వీళ్లు మరియొక రాజు గురించి మాట్లాడుతున్నారే అని కలత చెందాడు. ఆయనతో ఎరుషలేము నగరం అందరూ కూడా కలత చెందారని చూస్తున్నాం. వెంటనే హెరోదు రాజు ఒక ప్రణాళిక వేస్తున్నాడు. తన హృదయంలో కుయుక్తిగల ఆలోచన పెట్టుకుని ఒక ప్రణాళిక వేస్తున్నాడు. జ్ఞానులతో అబద్ధముగా మాట్లాడుతున్నాడు. మీరు వెళ్లి ఆ శిశువును చూచి వెంటనే నాకు చేప్పుడి నేను వచ్చి ఆయనను నమస్కరిస్తాను అని చెబుతున్నాడు. జ్ఞానులు బయలుదేరి వెళ్లారు కానీ ఎక్కడికి వెళ్లాలి ఏ దిక్కునకు వెళ్లాలి ఏమీ అర్థం కాలేదు. బైబిల్లో ఈ విధంగా రాయబడింది తూర్పు దిక్కున వాళ్ళు చూచినా నక్షత్రము వారి ముందు నడిచింది. కాబట్టి సరియైన మార్గంలో వెళ్లి సరైన చోటుకు చేరుకున్నారు. ఏసుప్రభును నమస్కరించి కానుకలు చెల్లించిన తర్వాత దేవుని నడిపింపు చొప్పున తమ దేశమునకు వేరే మార్గం గుండ తిరిగి వెళ్ళిపోయారు. 

 

 ప్రియమైన వారలారా! జ్ఞానులను సమస్త విదములైన కిడైనా మార్గములను తప్పించి సరైన మార్గంలోనికి నడిపించే దేవుడు ఆ నక్షత్రాన్ని చూపించాడు. ఈ దినము జ్ఞానుల వలె మన జీవితంలో నడుస్తూ ఉన్నాం. మనలను కీడు అయిన మార్గం నుండి తప్పించుటకు మంచి మార్గంలో నడిపించుటకు ఈ లోకంలో అనేక కార్యములు కలవు కానీ మనలను సరియైన మార్గం నడిపించుటకు మన కొరకు దేవుడు సిద్ధం చేసిన విలువ గలిగిన నిధి అదే బైబిల్. రోజు దాన్ని చదివి ధ్యానించి మనం వెళ్ళవలసిన మార్గంలో నడిపిస్తుంది. యవ్వన జీవితంలో ఉన్నవారు దీన్ని పాటించిన యెడల వారి కీడు అయిన మార్గమును తప్పించుకొని సరైన మార్గం ఎంచుకుంటారు అనేదాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. 

- బ్రదర్. శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:- 

మన క్యాంపస్లో రోడ్లు మరియు బ్రిడ్జిలు కట్టబడేట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet