By Village Missionary Movement
Tuesday, 12-Dec-2023దిన ధ్యానము(Telugu) 12.12.2023
అంశం:- నిజమైన వెలుగు
"నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది" - యోహాను 1:9
పరిశుద్ధ గ్రంథంలో దయ్యములు చేత పీడింపబడి తన్ను తాను గాయపరచుకున్న ఒకని గురించి చదువుతున్నాం. ఆయనను ఎవరు అదుపు చేయలేని వాడిగా ఉంటూ సమాధిలో నివసిస్తూ ఉండేవాడు. ఏసుప్రభు ఒక దినము ఆ మార్గము గుండా వెళ్లారు. దెయ్యములను వెళ్లగొట్టి వాడిని స్వస్థపరిచారు. ఆయన తెలివిగలవాడై వస్త్రం ధరించుకొని కూర్చున్నాడు. తరువాత అనేకులు ప్రభువు చెంతకు రావడానికి కారణం సమాధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభువు మార్చారు.
గొప్ప క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఒకరు పసిప్రాయములోనే సండే స్కూల్ మరియు ఆలయపు ఆరాధనలో క్రమంగా పాల్గొనేవాడు. బైబిల్, ప్రార్థన, వాక్యం చదువుట, తల్లిదండ్రులకు లోబడుట అని మంచి పిల్లవాడుగా ఎదిగాడు కానీ ఎదుగుతున్న కొలది ప్రభువు నుండి అంచులంచలుగా దూరమయ్యాడు. స్నేహితులతో కలిసి వాడి ఇష్టం వచ్చినట్లు జీవించాడు. ఇంటి వాళ్లకు బంధువులకు ఆయన గురించి చింత ఎక్కువైంది. సాతాను యొక్క గుణాతిశయములు అనేకములు వాటిలో ఉండేవి. నిజముగా క్రీస్తుకు శత్రువుగా మారాడు పేరుకు మాత్రమే క్రైస్తవుడు. ఇలా జీవిస్తున్న సమయంలో ఆయన చేతిలో ఒక గడ్డ ఏర్పడింది. అది క్యాన్సర్ కావచ్చు అని వైద్యులు చెప్పడం వల్ల వీడికి ఒకే భయం ఎలాగైనా బాగుపడాలి అని తలంచి అందరి కొరకు సిలువలో రక్తము కార్చి మరణించి తిరిగి లేచిన యేసయ్యను నమ్మి తన పాపములను ఏమీ దాచుకోకుండా ఒప్పుకున్నాడు. ఏసుక్రీస్తు రక్తము సమస్త పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అనే వాక్యానుసారముగా ఆయన పాపములు మాత్రమే కాదు దానిలో నుండి రోగమును కూడా దూరం చేశారు. ఈ దినము అనేక చోట్లకి వెళ్లి ఆయన గురించి పరిచర్య చేయుటకు ఏర్పరుచుకున్నారు. ఆయన నామ మహిమార్ధమై వాడుకుంటున్నారు. ఈ దినము దాన్ని రాయుటకు కూడా సహాయం చేసి ఉన్నారు.
అవును పాపములో, రోగములో, అక్రమాల్లో ఉండిన నన్ను దేవుడు విడుదల చేసి ప్రకాశింప జేయగలిగే దేవుడు ఈ దినము దీన్ని చదువుతున్న నిన్ను కూడా ప్రకాశింప చేస్తాడు. ఏసుక్రీస్తు జన్మదినము కొనియాడుతున్న ఈ కాలంలో మీ హృదయములో ఆయన జన్మించుటకు చోటు ఇవ్వండి. వాక్యానుసారముగా జీవించుటకు సమర్పించుకొనుడి. ఎంత చీకటి గల జీవితముగా జీవించినప్పటికీ ప్రకాశవంతముగా మార్చగలిగిన ఆ నిజమైన దేవుడు చీకటి కరమైన జీవితాన్ని వెలుగుగా మారుస్తారు అనేదాంట్లో ఎంత మాత్రమూ సందేహం లేదు. హల్లెలూయ!
- బ్రదర్. సిమ్యున్ గారు
ప్రార్థన అంశం:
మన క్యాంపస్ లో జరుగుతున్న ట్యూషన్స్ సెంటర్ పరిచర్య కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250