By Village Missionary Movement
Monday, 11-Dec-2023దిన ధ్యానము(Telugu) 11.12.2023
అంశం:- కలతల సంతోషమా
"వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి" - మత్తయి 2:10
జాన్ మరియు పీటర్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్న విద్యార్థులు. కానీ ఇద్దరు కూడా పాఠములు నేర్చుకునే దానిలో వ్యత్యాసం గలవారు. జాన్ ఏ దినపు పాఠాన్ని ఆ దినము చదివేసి చక్కగా దాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ పీటర్ అయితే పరీక్షలు వచ్చే సమయానికి చదవడం ప్రారంభించి మంచి పోటీని ఇచ్చేవాడుగా ఉంటాడు. వారు పరీక్ష కొరకు సిద్ధపడుతూ ఉండగా హఠాత్తుగా అనుకొనని పరిణామములు వలన పరీక్షలు యొక్క తేదీలు మార్చబడ్డాయి. జాన్ కైతే మంచి మార్కులు సంపాదిస్తాను అనే సంతోసం ఎమి చదవని పీటర్ అయితే అంత పెద్ద పుస్తకాన్ని వారం రోజుల్లో చదవగలనా అనే కలత. ఇలాగే రాజైన హేరోదు కాలంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క జననము జ్ఞానుల ద్వారా ప్రకటించబడింది (మత్తయి 2:3). హేరోదు రాజు దాని విన్నప్పుడు ఆయనతోపాటు తన రాజ్యంలో ఉన్న వారంతా కలత చెందారు. అయితే వారి యొక్క కలత దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నడుచుకునే విధముగా ఆలోచింపజేసింది. వారు యూదులకు రాజుగా పుట్టిన యేసును చూచుటకు ఇష్టపడలేదు. మారుగా ఆయన చంపుటకు ప్రణాళిక వేశారు. కానీ క్రీస్తు జన్మను నక్షత్రము ద్వారా ఎరిగిన జ్ఞానులకు అది సంతోషాన్ని కలిగించింది. వెంటనే వారికి ఆయనను చూడాలి అని ఆసక్తిని కలిగించింది. అది వాళ్లను దేవుని ప్రణాళిక వైపు నడిపించింది. వారు నక్షత్రాన్ని విడిచి మనుషులు సహాయము కోరుకొని అపజయాన్ని పొందినప్పటికీ వారి యొక్క ప్రయత్నం విడిచిపెట్టలేదు. అదే నక్షత్రం మరల వారికి కనబడి వారికి దారి చూపించింది. ఏసుప్రభు ఉన్న స్థలం వరకు వారిని తీసుకుని వెళ్ళింది.
ఆయనను చూసిన వారు అత్యానంద బరితులైరి.
ప్రియమైన వారలారా మనకు క్రీస్తు యొక్క రెండవ రాకడ ప్రకటించబడుతూ వస్తుంది. మనలను తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా క్రీస్తు రాబోతున్నారు అనే దాన్ని మనం విని ఎంత మాత్రం ప్రయత్నం చేయకుండా లోక కార్యములో మునిగిపోయి ఉంటే ఆయన వస్తున్నాడు అనే వార్త మన హృదయములో కలతను కలిగిస్తుంది. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనము ఆయనను కలతతో ఎదుర్కొనబోతున్నామా? సంతోషముతో ఎదుర్కొనబోతున్నామా? అనేది మనమే నిర్ణయించుకుందాం.
- శ్రీమతి. సినిల్డా సెల్వ రాజు గారు
ప్రార్థన అంశం:-
మన క్యాంపస్ లో జరుగుతున్న వైద్య పరీక్షల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250