By Village Missionary Movement
Saturday, 09-Dec-2023దిన ధ్యానము(Telugu) 09.12.2023
అంశం:- మనతో ఉంటున్న యేసు
"ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము" - మత్తయి 1:23
ప్రభువు మనతో ఉండి మనలో నివాసము చేస్తున్నారు. మనలను నడిపిస్తూ అలానే ఎన్నడు విడువని దేవుడిగా ఉన్నారు. అవును ఇమ్మానుయేలు అను పేరునకు దేవుడు మనకు తోడై ఉన్నారు అని అర్థం. యోహాను తన సువార్తలో ఆదియందు వాక్యముండెను వాక్యము శరీరధారియై కృపతోను సత్యముతోను నిండిన వారై మన మధ్య నివాసం చేసెను. మనము ఆయన మహిమను చూచెదము అని రాసి ఉన్నారు.
యేసు అను పేరునకు హెబ్రీ భాషలో యెహోవా లేదా యెశువా అని అర్థము. గ్రీకు భాషలో రక్షకుడు అని అర్థము. పాపములు, రోగములు, ప్రమాదాలు, కష్టములు, పోరాటాలు, పేదరికము, నరకము వీటన్నిటి నుండి కాపాడుతారు అన్నది దీని యొక్క అర్థం. మనుషులు తమను తాము రక్షించుకొనలేరు మనలను పాపం నుండి విడుదల అనుగ్రహించి నిత్య జీవితమును అనుగ్రహించే వారు ఏసుప్రభు మాత్రమే. ఆయనకు మనతో నివాసం ఉండటం ఇష్టం.
ఏదేను తోటలో దేవుడు ఆదాము హవ్వతో నడిచిన విధానాన్ని బైబిల్లో మనం చూస్తాం. కానీ వారైతే పాపం వలన దేవుని విడిచి వేరైపోయి భయంతోనూ సిగ్గుతోను తమను తాము దాచుకున్నారు. ఈ దినము మనము దేవునితో ఐక్యపడకుండా ఉండడానికి దేవుడు మనతో ఉండలేని విధముగా చేసినవి మన పాపములే.
మనలో కనబడుతున్న పాపపు అభ్యంతరాలను విడిచిపెట్టి మరలా బంధాన్ని నూతన పరచుకొనుటకు దేవుని దగ్గర జీవించుటకు ఏసుప్రభు సిలువలో చిందించిన రక్తము ద్వారా పాపక్షమాపణ మనకు ఉన్నది. పాపాల్ని ఒప్పుకొని క్షమాపణ పొందుకొని రక్షింపబడిన వారికి మాత్రమే నూతన అనుభవం కలుగుతుంది. ఏదేను యొక్క అనుభవాన్ని మరలా పొందుకోగలం. ఆయన మనుషులు మధ్య నివాసం చేస్తారు అప్పుడు వారు దేవుని జనాంగముగా ఉంటారు దేవుడు వారితో కూడా ఉండి వారిదేవుడిగా ఉంటారు. (ప్రకటన 21: 3) ఎంత గొప్ప వాగ్దానం.
నా ప్రియమైన వారలారా మనల్ని మనమే నిదానించి ఇమ్మానుయేల్ యొక్క రక్తము ద్వారా కడుగుబడి దేవునితో జీవిద్దాం. దేవుడు మనతో ఉన్నారు. హల్లెలూయ!
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు
ప్రార్థన అంశం:-
మన క్యాంపస్ లో కట్టబడుతున్న కొత్త స్కూలు కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250