By Village Missionary Movement
Tuesday, 28-Nov-2023దిన ధ్యానము(Telugu) 28.11.2023
అంశం:- కృతజ్ఞతతో జీవిద్దాం
"నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును" - కీర్తనలు 34:1
ఆఫ్రికాలో కారి అనే ఒక ప్రజలు జీవిస్తూ వస్తున్నారు. వారి మధ్యలో ఒక వ్యత్యాసమైన అలవాటు ఉన్నది. అదేమిటంటే వారు ఒకరికొకరు కృతజ్ఞతా చెల్లించుకునే విధానమే. అది చాలా ఉత్సాహవంతమైనది. కృతజ్ఞత చెల్లించే వ్యక్తి ఎవరికీ కృతజ్ఞత చెల్లించాలి అని ఆశిస్తున్నారో వారి యొక్క ఇంటికి వెళ్లి వాళ్ళ పక్కనే నిశ్శబ్దముగా కూర్చుంటారు. కొంత సమయం ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చొని తన కృతజ్ఞతలు వ్యక్తపరుస్తారు.
అవును మన పరలోకపు దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు మనము కోరిన యెడల ఆయన సన్నిధానంలో మనము మనస్ఫూర్తిగా ప్రశాంతముగా కూర్చుండుటయే తగిన మార్గము. బేతని మరియ అదే చేసింది. దేవుని సన్నిధిలో మన విజ్ఞాపనలను పట్టికలు వేయకుండా దేవుడు చేసిన మేళ్లను తలచుకుని కృతజ్ఞత చెల్లించుటకు మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఉండాలి అప్పుడే దేవుని గురించి మనం ఇంకా ఎక్కువగా గ్రహించుకోగలం. మరియ సహోదరుడైన లాజరు మరణించి నాలుగు దినముల తర్వాత యేసుప్రభు వచ్చినప్పుడు మరియ యేసు యొక్క పాదాల వద్ద పడి ఏడుస్తూ మీరు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు మరణించి ఉండడు అని అంటున్నది. ఆయనను ఎక్కడ పెట్టారు అని యేసు అడిగిన వెంటనే విశ్వాసముతో వచ్చి చూడండి అని చెప్పింది మరియ. యూదులతో మరి వేరే మాటలు ఏమీ మాట్లాడలేదు. రాయిని దొర్లించండి అని మాత్రమే మరియ చెప్పింది. అయ్యో దుర్వాసన వస్తది అని మార్త మాట్లాడింది మరియ అదే స్థలములో దేవుని పైన విశ్వాసముతో ప్రశాంతంగా ఉంటున్నది. తన సహోదరుని జీవముగలవాడిగా మరలా పొందుకున్నది.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీ యొక్క కార్యము మరణించినట్లుగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధానంలో మౌనంగా ఆయనను ప్రశ్నించకుండా మీరు కూర్చుని ఉంటే చాలు జరగదు అనే విదముగా కార్యము ఉన్నప్పటికీ కార్యము మరల సజీవంగా జరుగుతుంది. కృతజ్ఞత చెల్లించుటకు దేవుని వద్దకు వచ్చిన ఎడల ప్రశ్నలు అడగకుండా మీ విజ్ఞాపనలను పట్టికలు వేయకుండా ప్రశాంతముగా దేవుని సన్నిధానంలో కూర్చుని కృతజ్ఞతలు చెల్లించి చూడుడి ఇది మీ జీవితాన్ని మారుస్తుంది.
- బ్రదర్. కామరాజు గారు
ప్రార్థన అంశం:
మన క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250