Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.11.2023
Share:

By Village Missionary Movement

Thursday, 23-Nov-2023

దిన ధ్యానము(Telugu) 24.11.2023

 

అంశం:- ఆలస్యం

 

"కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు" – 2 పేతురు 3:9 

 

డి.యల్.మోడీ అనే ప్రసంగీకుడు ఒకసారి తన అనుదిన చర్యలు అన్నీ కూడా పూర్తి చేసుకుని చాలా అలసిపోయి పడుకోవడానికి వెళ్ళిపోయారు. మధ్య రాత్రిలో దేవుడు అతని లేపి నీవు వెళ్లి నీ వంట మనిషికి సువార్త చెప్పు అన్నారు. కానీ డిఎల్ మోడీ అయితే మిక్కిలి అలసట వలన రేపు ఉదయాన్నే వెళ్లి చెబుతాను అని చెప్పి పడుకుండిపోయారు. ఎంతో బాధాకరం ఉదయమున లేచి చూచేసరికి వంట మనిషి ఆత్మహత్య చేసుకుని మరణించుట ఆయన చూశారు. దానిని చూచిన డి.ఎల్. మోడీ అందుకు గల కారణం నా ఆలస్యమే అని గ్రహించి కన్నీరు కార్చారు. 

 

 బైబిల్లో ఆలస్యం వలన అనేక ఆశీర్వాదములు పోగొట్టుకున్న వారిని చదువుతూ ఉన్నాం. ఏసావు తన తండ్రికి వంటచేసి తీసుకురావడం ఆలస్యం అయినందువలన యాకోబు మోసగించి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. లోతు సొదొమ గొమొర్ర అనే పట్టణాన్ని విడిచి బయలుదేరటకు ఆలస్యం చేశారు. దూతలు అతని చేయిపట్టి పట్టణము అవతలకు తీసుకుని వచ్చి విడిచిపెట్టారు అని చదువుతూ ఉన్నాం. ఆలస్యం చేయటం వల్ల ముగింపు మేలుగా లేదు అని చదువుతూ ఉన్నాం. అదేవిధంగా ఎస్తేరు ఆలస్యము చేయకుండా ఉండటం వలన అనేకమంది కాపాడబడ్డారని చదువుతున్నాం. 

 

ప్రియమైన వారలారా ఆలస్యం చేయటం వలన అనేక ఆశీర్వాదాలు కోల్పోవుటకు కారణం అవుతుంది. ఆలస్యంగా చేసిన ఏ కార్యము కూడా చేయకుండా ఉండటతో సమానమే. ఆలస్యమైన విధేయత అవిధేయతకు సమానం. ఈ దినము మనలో అనేకులు ఆలస్యం చేస్తూ దేవాలయముకు వెళ్లేటవలన మరియు ఆలయమునకు వెళ్లిన ఆరాధనలో శ్రద్ధ లేనందువలన అశ్రద్ధ చేయటం వలన అనేక మేలులను పొందుకోకుండా ఉంటూ ఉన్నాం. ప్రభు యొక్క రెండవ రాకడ ఆలస్యం అని చెప్పుట వింటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్కరు నశించుట ఆయనకు ఇష్టం లేదు. అందరూ మారుమనస్సు పొందాలి అని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నారు. కనుక మనం ఆలస్యం చేయకుండా మన దేవుని రాజ్యము కొరకు త్వరగా పని చేస్తాం. 

- శ్రీమతి. జయంతి భాగ్యనాధన్ గారు 

 

ప్రార్థన అంశం:

క్రిస్మస్ సందర్భంగా మనము చేస్తున్న సువార్త పరిచర్య ద్వారా అనేక ఆత్మ రక్షింపబడినట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet