By Village Missionary Movement
Thursday, 23-Nov-2023దిన ధ్యానము(Telugu) 23.11.2023
అంశం:- పిల్లలు
“ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము” - సామెతలు 23:6
ఒక విధవరాలైన తల్లి తన కుమారుని చూడడానికి జైలుకు వెళ్లింది. అక్కడ కుమారుడు తన తల్లిని చూచుటకు ఇష్టపడలేదు. ఆమెను చూచుటకు తిరస్కరించాడు. కుమారుడు చేసిన నేరమునకు తర్వాత దినాలలో ఆయనను కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడకు కూడా ఆయన యొక్క తల్లి వచ్చారు కానీ కుమారుడు తల్లిని చూచుటకు ఇష్టపడలేదు. కానీ అతీ బలవంతం మీద తల్లిని చూచుటకు వచ్చాడు. నాకు ఈ పరిస్థితికి మీరే కారణం అని అన్నాడు. తల్లి ఆయనను చూసి ఏడుస్తూ ఉంది. ఆ కుమారుడు తల్లిని చూస్తూ నేను చిన్నతనంలో చిన్న చిన్న దొంగతనాలు చేసి తీసుకువచ్చి మీకు ఇచ్చినప్పుడు మీరు నన్ను గద్దించి బాగు చేయలేదు అందువలన నేను పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టాను. అప్పుడు తల్లి నీవు చెప్పినది సరే కానీ నీ మీద ఉన్న ప్రేమ చేత గద్దించిలేకపోయాను కానీ అది ఎంత పెద్ద పొరపాటు అని ఇప్పుడు గ్రహిస్తున్నాను అన్నారు.
అవును బైబిల్లో కూడా ఏలి అనే యాజకుడిని చూస్తున్నాము. ఆయన దేవాలయంలో పరిచర్య చేసేవాడు కానీ ఆయన యొక్క పిల్లలు దేవుని యొక్క భయము లేక ఉన్నారు అని బైబిల్లో చూస్తున్నాం. ఇందువలన వారు యవ్వన ప్రాయంలోనే ఒకేరోజులో మరణించారు. అలాగే ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండిన సమూయేలు ప్రవక్త యొక్క పిల్లలు కూడా లంచము పుచ్చుకునే వారిగా ధనాపేక్ష గల వారిగా న్యాయాన్ని అన్యాయంగా మార్చే వారిగా ఉన్నారు అని మొదటి సమయాలు 8వ అధ్యాయం చదువుతున్నాము. అందువలన న్యాయాధిపతులుగా ఉండవలసిన వారు తిరస్కరించబడ్డారు.
అవును మనము మన పిల్లలను ఎలా పెంచుతున్నాం? దేవుని హస్తములో అప్పగించి పెంచుతున్నామా లేదా లోక కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చి పెంచుతున్నామా? యోబు తన పిల్లలు ఎదుట యదార్థముగా ఉన్నాడు। పిల్లల పాపము చేసి ఉంటారేమో అని తలంచి వారి కొరకు దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. మనము కూడా మన పిల్లలను చిన్న ప్రాయంలోనే యదార్థమైన సత్యమైన మార్గంలో నడిపిద్దాం. త్వరగా గతించిపోయే ఈ లోకంతో కలిసి నడవకుండా దేవుని కొరకు పౌరుషముగా పరిగెత్తుటకు ఒక సంతతిని తయారు చేయుటకు ప్రయాస పడదాం. ఆమెన్!
- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు
ప్రార్థన అంశం:
24 గంటల చైన్ ప్లేయర్ అన్ని ఫీల్డ్ లో జరిగేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250