Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.11.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 21-Nov-2023

దిన ధ్యానము(Telugu) 22.11.2023

 

అంశం:- దగ్గరకు

 

"ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున" - హెబ్రీయులకు 12:1

 

దేవుడు మనలను చూసినప్పుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. పాపము మన హృదయానికి మురికిని కలిగిస్తుంది. హృదయము మురికితోనో, మరకలతోనూ అపవిత్రముగా ఉంటే ఎలా ఉంటుంది? పాపము అలానే మన హృదయాన్ని మారుస్తుంది. మన చేతుల చేత కాళ్లు చేత చేసే కార్యములు వలన ఈ పాపమును మనలోనికి రాలేదు ఇది కన్నుల ద్వారా, చెవుల ద్వారా కూడా ఎందుకు మన ఆలోచన ద్వారా కూడా వస్తున్నాయి. 

 

ఆలోచన అని చెప్పేటప్పుడు మనం ఆలోచించవలసినది పాపము ఎంత దగ్గరగా ఉన్నది అన్నదే. సాధారణంగా ఆలోచించుట ప్రారంభిస్తే చాలు మన ఆదుపు దాటి అది వెళ్ళిపోతుంది. మన నిజలోకాన్ని విడిచి ఊహా లోకంలోనికి మునిగిపోతూ ఉన్నాం. తప్పిదమైన ఆలోచనలు మనలను రేపే విధముగా ఫోను, యూట్యూబ్, ఫేస్బుక్ అని మన చేతుల్లో అనేక కార్యాలు ఉన్నాయి. నెబుకద్నేజరు నేను కట్టిన మహా బబులోను కదా అని ఆలోచించాడు అందుకు ఆయన మృగముగా పశువుగా మారిపోయాడు. దావీదు కనులతో పాపములో పడిపోయాడు. సంసోను అన్ని తెలిసి చచ్చిన సింహం శరీరంలో ఉండిన తేనె పట్టును తీసి తినడం ప్రారంభించాడు పాపములో పడ్డాడు తర్వాత శరీరేచ్లో పడిపోయాడు. ఇలా పాపము సంతోషముగా ఉండి మనలను పరిగెత్తలేని విధముగా పడగొట్టేస్తుంది. దూరముగా కనిపించే పెద్ద బండరాయి కాదు మన కాలుపక్కనే పడియున్న చిన్నచిన్న రాళ్లే మనలను బోల్తా కొట్టినట్లు చేస్తా ఉంటాయి. అలానే మన చుట్టూ ఉన్న అబద్ధాలు, మొబైల్స్ అనే చిన్న చిన్న పాపాలు మనలను పడగొట్టే అవకాశం కలవు. 

 

దీన్ని చదువుతున్న స్నేహితులారా చిన్నచిన్న పాపాలే కదా అని అశ్రద్ధ కలిగి ఉన్నారా? నా దగ్గరకు వచ్చిన పాపము నన్ను పడగొట్టలేదు నన్ను తాకి మాత్రమే వెళ్ళిపోయింది అని అంటున్నారా? వెంటనే దాన్ని విడిచి పెట్టండి లేకపోతే ప్రమాదం పెద్దదైపోతుంది. మన దగ్గర ఉన్న పాపం మనలను తాకడం మాత్రమే కాదు మన పైకి ఎక్కి మనలను సంపూర్ణంగా పరిపాలన చేస్తుంది. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. (హెబ్రీయులు 12: 1) 

- శ్రీమతి. అనుభూ స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:

ఫీల్డ్ లో బైబిల్ కొని నూతన విశ్వాసులకి ఇచ్చే సహాయకులు లేచునట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet