By Village Missionary Movement
Thursday, 16-Nov-2023దిన ధ్యానము(Telugu) 16.11.2023
అంశం: యేసు ఎప్పుడు మనతోనే
"వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు" - యిర్మియా 1:8
విదేశమునకు చెందిన విలియం అనే వ్యక్తి తన భార్య మేరీ డానర్ తో కలిసి ఒక రైలు పట్టాలు దాటుతున్నారు. దూరం నుండి రైలు వచ్చుట చూచిన ఇద్దరు కూడా త్వరగా ఆ పట్టాలను దాటుటకు ప్రయత్నించారు. కానీ మేరీ డానర్ యొక్క కాలు ఒకటి ఆ పట్టాలలో చిక్కుకుంది. చాలా గాబరాతో కాలును పైకి తీయుటకు ప్రయత్నించారు కానీ అది జరగలేదు. అక్కడ ఆ పరిస్థితిని గమనించిన భర్త తన భార్యని ఎలాగైనా కాపాడుకోవాలని పోరాడారు. ఇంతలోగా ట్రైన్ దగ్గరికి వచ్చేసింది. మేరీ డానర్ తన భర్తను చూసి మీరు దూరంగా వెళ్లిపోండి అని కేక వేశారు కానీ విలియం చెప్పిన చివరి మాట నేను నీతోనే ఉండబోతున్నాను అన్నదే అదే వారి యొక్క చివరి మాట. ఈ దృశ్యాన్ని చూసిన అనేకులు ఈ వార్త విన్న అందరూ భర్త యొక్క ప్రేమను చూసి ఆశ్చర్యపోయారు. దీనికంటే కొన్ని కోట్లు రెట్లు అత్యధికమైనది మన పరమ తండ్రి యొక్క ప్రేమ మనం పాపులుగా ఉండేటప్పుడు మన కొరకు ప్రాణము పెట్టిన ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి.
యాకోబు మోసగాడిగా తన సహోదరుడిని తన తండ్రిని మోసగించినప్పటికీ దేవుడు తనను ఈ విధముగా అడుగుతున్నారు. తన సహోదరులకు భయపడి తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా రాయిని తలకింద పెట్టుకుని ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నీతోనే ఉన్నాను అని మాట్లాడారు. దర్శనమిచ్చి ఈ స్థలానికి తిరిగి వచ్చేవరకు నీతోనే ఉంటాను అన్నారు. లాబాను ఇంట్లో రెండు గొప్ప దీవెనలు సంపాదించుకుని తిరిగి వస్తున్నారు. అప్పుడు లాభాను దైవములు దొంగలించబడ్డాయి అని సైన్యంతో వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు. యాకోబు తన సహోదరునికి భయపడినప్పుడు బలము తగ్గినట్లు అనిపించింది కానీ ఒంటరిగా దేవునితో పోరాడినప్పుడు ఏడ్చినప్పుడు ఆయన నీతోనే ఉన్నాను అని చెప్పి ధైర్యపరిచారు. అవును నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయనతో చెప్పండి. దేవుడు నేను నీతోనే ఉన్నాను అని చెప్పి మిమ్మల్ని బలపరచుట మీరు గ్రహిస్తారు. హల్లెలూయ!
- శ్రీమతి. బేబీ కామరాజు గారు
ప్రార్థన అంశం:
మన క్యాంపస్ లో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రేయర్ కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250