By Village Missionary Movement
Tuesday, 14-Nov-2023దిన ధ్యానము(Telugu) 14.11.2023 (Children’s day Special)
అంశం: ప్రేమగల తండ్రి
"ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి" - మత్తయి 19:14
హలో పిల్లలు ఈ దినం మీ యొక్క దినం అనగా చిల్డ్రన్స్ డే. మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. నెహ్రూ అంకుల్ అని చిన్న పిల్లలు ప్రేమగా పిలిచే ఒక ప్రధానమంత్రి మనగా ఉండేవారు. ఆయన యొక్క పుట్టినరోజును చిల్డ్రన్స్ డే గా ఆచరిస్తున్నాం. చూడండి ఒక ప్రధానమంత్రికి మీ మీద చాలా ప్రేమ. ఈ లోకంలో ఉన్న అందరి కంటే యేసయ్యకు మీ మీద చాలా ప్రేమ మీరంటే చాలా ఇష్టం. దాని గురించిన నిజ సంఘటన ఒకటి చూద్దామా?
అమెరికా దేశంలో ఉండి ఆంగ్లోమా అనే సేవకుడు మన తమిళనాడులో గల సంఘమునకు ప్రసంగించుటకు పిలవబడి ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన సాక్షాన్ని విందామా? నేను చిన్నవాడిగా ఉండేటప్పుడు ప్రేమ కొరకు ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నాకు తండ్రి ఎవరో తెలియదు అమ్మని అడిగితే అమ్మ చాలా కోపంతో అరుస్తుంది. ప్రేమ లేని చోటున ఉన్నందున ఎప్పుడూ దుఃఖముతోనే ఏడుస్తూ ఉండేవాడిని. ఒక దినము అమ్మ నన్ను పార్కులో కూర్చోబెట్టి ఇదిగో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. సాయంకాలము అయినప్పటికీ రాలేదు చీకటి అయిపోయింది. ఒకే చోటులో ఉన్నందున నేను ఏడవడం ప్రారంభించాను. ఆకలి ఒకపక్క, భయం మరొకపక్క అలాంటి సమయంలో ఒకాయన వచ్చి నన్ను ప్రేమతో ఎత్తుకొని కన్నీళ్లు తుడిచి అని ఇంటికి తీసుకుని వెళ్లారు. కడుపునిండా ఆహారం పెట్టి ఇంటిలో అందరూ నన్ను ప్రేమగా చూసుకున్నారు.
మనసు చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో నాలాగా ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వాళ్లకు ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ నాకు కూడా పాఠాలు చెప్పేవారు. వారు సండే స్కూల్ కి వెళ్ళినప్పుడు నేను కూడా వారితో వెళ్లేవాడిని. అక్కడ నేర్పించిన పాటలు పాఠాలు అన్నీ కూడా నాకు చాలా ఇష్టంగా ఉండేవి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని ఆమె చెప్పిన మాట నన్ను చాలా సంతోషపరిచింది. ఆ దినం నుండి యేసయ్యను నాన్న నాన్న అని పిలిచి నాకు అవసరమైన అన్నింటిని పొందుకుంటూ ఉండేవాడిని. అనేకమైన కష్టాలలో యేసయ్య బిడ్డగా జీవించి పెద్దవాడు అయ్యాను. యేసయ్య నన్ను పరిచర్య చేయడానికి పిలిచాడు. నా జీవితంలో ఆయన చేసిన మేళ్లను ఇతరులకు చెప్పడం ప్రారంభించాను. ఆత్మీయ వరాలు, ఆయన శక్తి నాకు ఇచ్చారు. ఈ దినము లోకమంతా ప్రయాణం చేసి ఆయన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను నాకే ఆశ్చర్యం. నా తండ్రి ఉండి ఉంటే ఇలాంటి భాగ్యం నాకు దొరికి ఉండేది కాదేమో అని చెప్పారు.
హలో పిల్లలు మీరు కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే మిమల్ని కూడా ఆయన ఇష్టానుసారముగా మిమ్మల్ని హెచ్చిస్తారు. ఓకేనా!
ప్రార్థన అంశం:-
మీడియాలో మరియు ఆఫీసులో పనిచేస్తున్న సేవకులు గురించి ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250