Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.11.2023
Share:

By Village Missionary Movement

Sunday, 12-Nov-2023

దిన ధ్యానము(Telugu) 13.11.2023

 

అంశం: అరణ్యములో మార్గము

 

"అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును" - యెషయా 13:19

 

హిమాలయాల్లో టీ దుకాణం ఒకటి నడిపిస్తూ వచ్చిన ఒక వృద్ధుడు మరియు ఆయన యొక్క కుమారుడు చాలా పేదరికంలో జీవిస్తూ వచ్చారు. ఒకసారి చాలా చలిగా ఉండడం చేత త్వరగా దుకాణమును మూసేసి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉండిన ఆ ఊరిలో ఉగ్రవాదులు చాలా అల్లర్లు చేసి ప్రతి ఇంటిని కొల్లగొట్టేసారు. ఈ వృద్ధాప్యంలో ఉన్న అతని యొక్క కుమారుడు తలను పగలగొట్టి వెళ్లిపోయారు. ఆ కుమారుడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళుటకు డబ్బులు అవసరం కానీ అతని డబ్బులు లేవు. ఆయన చాలా పేదవాడు. అందరూ ఉగ్రవాదుల చేత అనేక వస్తువులను పోగొట్టుకున్నారు. దుకాణంలో ఏవైనా డబ్బులు ఉంటాయని చూచుటకు వెళ్లారు. ఆ దుకాణం యొక్క తాళం పగలగొట్టబడి ఉంది పంచదార డబ్బా యొక్క అడుగు భాగమున వెయ్యి రూపాయలు కనబడేటట్లు ఉన్నాయి. ఈయన నా అవసరతను గ్రహించిన నేను ఆరాధించిన యేసయ్యా పెట్టేసి వెళ్లారు అని తలంచి ఆయనను స్తుతిస్తూ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 

 

ఆ డబ్బులను పెట్టి వెళ్ళినది ఒక సైన్యం యొక్క మేజర్. ఆ సైన్యం యొక్క మేజర్ తన సైన్యముతో ఆ మార్గంలో వచ్చేటప్పుడు టీ తాగాలని ఆశించడు కానీ ఆ టీ కొట్టు ముయబడి ఉండటం చూచి ఒక సైనికుడు చేత ఆ టీ దుకాణం యొక్క తాళం కప్పను బద్దలు కొట్టి వారు టీ చేసుకొని త్రాగి అక్కడ వెయ్యి రూపాయలు పంచదార డబ్బా కింద పెట్టి వెళ్లిపోయారు. ఆ డబ్బే టీ కొట్టు దుకాణం యొక్క అతని యొక్క కుమారుడు యొక్క గాయము కొరకు వాడబడింది. ఆ సైనికులు పని ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు ఆ పెద్దాయనను కలుసుకొని ఎలా ఈ చిన్న దుకాణమును నడిపిస్తూ జీవిస్తున్నారు అని అడిగినప్పుడు నన్ను యేసయ్య జీవింపజేస్తున్నారు అని చెప్పి జరిగిన సంఘటన వివరించారు. వెంటనే మేజర్ ఇలా చెప్పారు మీ యేసయ్య చాలా గొప్పవాడు ఆయనే మా ద్వారా మీకు సహాయం చేశారు అని చెప్పాడు. 

 

మన దేవుడు ఆశ్చర్య రీతిలో ద్వారము తెరిచే దేవుడు. హగరు అరణ్యంలో నీళ్లు లేకుండా ఉండి బిడ్డ కొరకు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒక ఊటను ఆమెకు చూపించారు. సంసోను దప్పికతో బాధపడుతున్నప్పుడు నీటి కొరకు దేవుని అడిగినప్పుడు ఒక ఊటను కలుగజేశారు. ఇశ్రాయేలు ప్రజలు బండ నుండి వచ్చే నీటిని త్రాగారు. 

 

ప్రియమైన వారలారా! అరణ్యం వంటి పరిస్థితుల్లో ఎవరైనా సహాయము చేస్తారా అని బాధపడుతూ ఉన్నారా? మీ కొరకు దేవుడు ఒక ఊటను ఇచ్చుటకు ఆయన శక్తిమంతుడు. ఎవరి ద్వారానైనా ఆయన సహాయం చేయుటకు శక్తిమంతుడు. అన్ని వేళల్లో ఆయన వైపు చూడండి మీకు సహాయం దొరుకుతుంది. మీ అవసరతలు సందింపబడుతాయి. దీవెనలు మీకు నిండుగా కలుగుతాయి. 

- మిస్టర్. శామ్యూల్ మోరిస్ గారు 

 

ప్రార్థన అంశం:

యవ్వనస్తుల కూడికల ద్వారా దర్శించబడుతున్న యనస్తుల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al