Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.11.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 11-Nov-2023

దిన ధ్యానము(Telugu) 12.11.2023 (Kids Special)

 

అంశం: బ్రెడ్ అండ్ బటర్

 

ప్రత్యేకముగా చిన్నపిల్లల కొరకు

 

"నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల?” - లూకా 6:41

 

అమ్మ అమ్మ నాకు చాలా ఆకలి వేస్తుంది బ్రెడ్ లో బట్టర్ పెట్టి ఇవ్వండి అని స్కూలు నుండి వచ్చి అడిగింది ఆగ్నెస్. అమ్మ వెంటనే బ్రెడ్ లో బట్టర్ పెట్టి ఇచ్చారు. ఆగ్నెస్ దాని చక్కగా తిని అమ్మకు ఒక ముద్దు పెట్టి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఏంటి పిల్లలు మీకు కూడా అమ్మ పెట్టిన బట్టర్ బ్రాడ్ అంటే ఇష్టమే కదా సరే కదా విందామా? 

 

రోజు బటర్ బ్రెడ్ కొంటున్న రొట్టె దుకాణం దగ్గరకు వెళ్లి ఆగ్నెస్ వాళ్ళ అమ్మ ఎందుకు మీ దుకాణంలో కొంటున్న బటర్ తక్కువగా ఉంటుంది అని అడిగింది. అలానే చాలామంది అలానే ఆ దుకాణం వచ్చి అడిగారు. వెంటనే ఆ దుకాణ దారుడుకు బట్టర్ తెస్తున్న ఆ వ్యక్తి పైన అనుమాన పడి ప్రతిరోజు బటర్ తీసుకొస్తున్న వ్యక్తికి ఎందుకు నీవు రోజు బటర్ తక్కువ తీసుకు వస్తున్నావు అని గొడవపడ్డారు. వెంటనే ఆయన సహనముతో లేదు సరిగానే బరువు చూసి తెస్తున్నాను అన్నారు. వెంటనే ఆ ఊరి ప్రజలు దుకాణం వాడికి సపోర్ట్ చేసి బట్టర్ తీసుకొచ్చే వాడిని తిట్టి చివరిగా సమస్యను ఆ ఊరి నాయకుడు వద్దకు తీసుకుని వెళ్లారు. ఆ ఊరి నాయకుడు దాన్ని బరువు చూసినప్పుడు పావు కేజీ ప్యాకెట్ కు 50 గ్రాములు తక్కువగానే ఉంది. వెంటనే ఆ ఊరి నాయకుడు కోపపడి నీవు అందర్నీ కూడా మూర్ఖులుగా చేసి మోసగిస్తున్నావు కాబట్టి ఇకనుండి ఈ ఊర్లో నీవు ఈ బటర్ అమ్మకూడదు అని చెప్పాడు. వెంటనే ఆ బట్టర్ వ్యాపారి అయ్యా నన్ను క్షమించండి నా త్రాసులో పావు కేజీ గుండు లేదు కాబట్టి ఈ యొక్క దుకాణంలో కొన్న పావు కేజీ రొట్టె ప్యాకెట్ నేను నా త్రాసులో గుండుగా వాడి ఈ బటర్ ప్యాకెట్లను తయారు చేస్తున్నాను అని చెప్పి ఒకపక్క రొట్టెను మరియొకపక్క బట్టర్ పాకెట్ పెట్టి బరువు చూశాడు. రెండు సమానంగానే వచ్చాయి అప్పుడు అందరూ ఆ బ్రెడ్ దుకాణం వాడిని చూసి నీవు తక్కువ బరువును అమ్మి ఎదుటివారి పైన నేరం మోపుతావా అని ఆయనను తిట్టి అందరు వెళ్ళిపోయారు. ఆయన కూడా తలదించుకొని సిగ్గుతో ఇంటికి చేరుకున్నాడు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి చూసావా? ఆయన చేసిన తప్పిదాన్ని మరుగు చేసి ఎదుటివానిపైన నేరము మోపి అందరిముందు ఎలా సిగ్గుపడ్డాడో అలాగే మీరు కూడా ఎప్పుడు ఇతరుల పైన నేరం మోపకూడదు. ఎప్పుడూ మనలను సరి చేసుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఓకేనా బాయ్! 

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al