Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.11.2023
Share:

By Village Missionary Movement

Saturday, 11-Nov-2023

దిన ధ్యానము(Telugu) 11.11.2023

 

అంశం: దేవుని యందు ఆనందము

 

"మరియు అతడు వారితో నిట్లనెనుపదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరుదుఃఖ పడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు" - నెహెమ్యా 8:10

 

రొమేనియా దేశంలో ఒక చిన్న గదిలో చాలా మంది క్రైస్తవులు బంధింపబడి ఉన్నారు. ఒక సువార్తికుడు కూడా క్రీస్తును ప్రకటించినందుకు అక్కడ బంధింపబడి ఉన్నారు. వారు తప్ప మిగిలిన వారందరూ క్రీస్తుని ఎరగనివారు దేవుని మీద నమ్మకం లేనివారు. వారి మధ్యలో ఎప్పుడు గొడవలు సమస్యలు ఉంటూ ఉండేవి. కానీ సువార్తికుడు చెరసాలలో గల కష్టాలు అన్నింటిలో కూడా ఇరుకుల్లో కూడా సంతోషంగా సహనముతో క్రీస్తు యేసుతో జీవించి వచ్చారు. అందరూ చూపు కూడా అ సువార్తికుడి మీద ఉండేది. ఆ సువార్తికుడితో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉండుటకు కారణం ఏమిటి అని అడిగారు. అందుకు ఆయన క్రీస్తే నా జీవితంలో సంతోషమునకు బలమునకు కారణము అని చెప్పాడు. అందుకు ఆ ఖైదీల అందరూ కూడా ఒక్కొక్కరుగా క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించారు. అందునుబట్టి ఆయనను రొమేనియా దేశస్థులు కొట్టి చిత్రహింస పెట్టి ఒంటరిగా చీకటి గదిలో వేసేసారు. అయినను అనేకమంది ఖైదీలు యేసుప్రభుని అంగీకరించి మారుమనస్సు పొందుకున్నారు. 

 

బైబిల్లో కూడా పౌలు సిలను చెరసాలలో చేతులు కాలు బంధింపబడినప్పటికీ దేవున్ని స్తుతించి పాడారు. దేవుని యందు సంతోషంగా ఉన్నారు. వారు జీవితం ద్వారా సువార్తను ప్రకటించి జీవించి చూపించారు. అందువలన చెరసాల తలుపులు తీయబడి ప్రతి ఒక్కరూ తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ వారి యొక్క బంధకాలు తెంపబడినప్పటికీ వారు విడుదలతో ఉన్నారు. దేవుని యందు ఎప్పుడూ సంతోషంగా ఉండడి ప్రభువు నందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి సంతోషించుడి మరలా చెప్పుదును సంతోషించుడి అని రాసిన ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4:4లో చదువుతున్నాం. వారు అలానే బ్రతికి చూపించారు కాబట్టి అనేక సంఘాలు కట్టబడ్డాయి. అది మాత్రమే కాదు అనేక పత్రికలో రాశారు. వాటిని పరిశుద్దాత్మ చేత అంగీకరించబడి బైబిల్లో కూడా రాయబడి ఉంది. 

 

మనకి ఇలాంటి కష్టాలు లేవు, మనదేశంలో సుఖముగా జీవిస్తున్నాం. అలాగైతే మనదేశంలో ఇంకా సంతోషంగా బలముతో క్రీస్తును మీ జీవితం ద్వారా చూపించి అనేకులను నరక ద్వారం నుండి తప్పించి పరలోక రాజ్యమును నడిపించే వారముగా విస్తారమైన ఆత్మల రక్షణ క్రీస్తు రాజ్యము కొరకు సంపాదించాలి అనేదాంట్లో సందేహం లేదు. క్రీస్తుని చెప్పేవారిగా కాక చూపించే వారిగా జీవిద్దాం . 

- శ్రీమతి. ఫాతిమా సెల్వ రాజు గారు 

 

ప్రార్థన అంశం:

ప్రతి రాష్ట్రంలో 500 మంది మిషనరీలు మన పరిచర్యలో కలిసి పనిచేసినట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al