Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.11.2023
Share:

By Village Missionary Movement

Thursday, 09-Nov-2023

దిన ధ్యానము(Telugu) 09.11.2023

 

అంశం: ఒరిజినలా లేక డూప్లికేటా

 

"సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి" - 1 థెస్సలొనికయులకు 5:21

 

చెక్కలతో చేయబడిన వస్తువుల అమ్మే దుకాణం అది. అక్కడ చందనపు చెక్కలతో చేయబడిన వస్తువుకి ప్రత్యేకమైన విలువ ఉండేది. ఆ చందనపు చెక్కలతో రెండు రకాలుగా వస్తువులు తయారు చేయబడ్డాయి. ఒకటి ఒరిజినల్ చందనపు చెక్కలతో చేయబడింది అది సాధారణంగా మంచి వాసన ఇచ్చేదిగా ఎక్కువ ఖరీదు కలిగినదిగా ఉండేది. రెండో రకమైన వస్తువు చందనపు తైలం పూయబడి ఎక్కువగా వాసన ఇచ్చేదిగాను వెల తక్కువ కలిగినదిగా ఉండేది. కానీ ఈ రెండవ రకమే కొనేవాళ్ళని ఆకర్షించేది. రెండో రకము గల వస్తువులనే ఎక్కువగా అందరూ కొనుక్కొని వెళ్లారు. దానిని చూచిన చందనపు చెక్కతో తయారు చేయబడిన వస్తువు ఏడుస్తూ ఉంది. దాన్ని చూచిన టేకు చెట్టు కుర్చీ మిత్రమా బాధపడకము సహనముతో ఉండుము అన్నది. ఒక యవ్వనస్తుడు ఆయన తండ్రితో వచ్చి నిలబడ్డారు. ఆ యవ్వనస్తుడు అయితే రెండవ రకమైన డూప్లికేట్ చందనపు చెక్క బొమ్మను ఎంచుకున్నారు కానీ చెక్క వస్తువులతో అనుభవం గల తండ్రి మొదటి రకమైన చందనపు చెక్కతో గల ఆ వస్తువును ఇవ్వమని అడిగారు. వాసన తక్కువ ఉన్నప్పటికీ అదే దాని యొక్క నిజమైన విలువను వివరించి ఒరిజినల్ చందనపు చెక్కలతో చేయబడిన వస్తువులను కొనుక్కొని వెళ్లారు. 

 

యేసుప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో దేవుని చేత ఎంచబడినప్పటికీ ఆయనతో తిని పండుకున్న ఇస్కారియోతు యుధా కూడా ఇతరుల దృష్టిలో శిష్యుడు గానే కనబడ్డాడు కానీ ధనాశ చేత ప్రభువుని అప్పగించుటకు మంచి సమయం చూస్తూ ఉన్నా క్రూరమైన గుణము ఇస్కారియోతు యుధా జీతములో ఉండేది. అప్పగించే సమయం వచ్చేవరకు దాన్ని ఎవరు గ్రహించలేదు. 12మంది శిష్యులతో చివరగా పస్కా విందు సమయంలో యేసు తనను ఒకడు అప్పగిస్తారు అనేసరికి ఒక్కొక్కరు నేనా నేనా అని అడిగినప్పుడు తన కార్యాన్ని గ్రహించిన ఇస్కారియోతు యుధా కూడా నేనా అని అడుగుతున్నాడు. తన క్రూరమైన మనస్తత్వాన్ని మార్చుకుంటున్నాడు. సమస్తాన్ని ఎరిగిన యేసయ్యతో అబద్ధం ఆడుతున్నాడు. చివరి సమయం వరకు ఒరిజినల్ శిష్యుడు వలె ఇస్కారియోతు యుధా మాట ఉండేది. 

 

అవును ప్రియమైన వారలారా! మనుషులు పై రూపాన్ని బట్టి మంచి వారిని తలంచి మోసపోతారు అలా మోసపోయిన వారు అనేకులు గలరు. అందువలన మన ప్రభువు సర్పం వలె వివేకముగాను పావురం వలే నిష్కపటముగా ఉండుడి అన్నారు. గొర్రె చర్మం కప్పుకొనిన తోడేలు వలె మనుషులు ఉంటారు జాగ్రత్త పడుడి అని అంటున్నారు. కాబట్టి వాళ్లు యొక్క ఫలాలు చేత వాళ్లను గ్రహించగలము అనేది ఎంత నిజమో చూడండి. మనము కూడా డూప్లికేట్ క్రైస్తవ జీవితం జీవించకుండా నిజమైన క్రైస్తవ్య జీవితం జీవించడానికి శ్రద్ధ కలిగి ఉందాం. 

- శ్రీమతి. శశికళ పరమశివం గారు 

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీ కార్యక్రమాలను సపోర్ట్ చేసే స్పాన్సర్లు లేచినట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet