Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.11.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 08-Nov-2023

దిన ధ్యానము(Telugu) 08.11.2023

 

అంశం: హేయములు

 

"మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు" - సామెతలు 11:20

 

యెహోవాకు అసహ్యములు అని అనేక కార్యములు బైబిల్లో గలవు. వాటిలో కొన్ని ధ్యానించి పరిశీలించి చూద్దాం. 

 

యెహోవాకు హేయమైన కార్యాలు 

 

(1) దొంగ త్రాసు 

దొంగ త్రాసు యెహోవాకు హేయములు (సామెతలు 11: 1). సాధారణంగా ఈ వాక్యము త్రాసును వాడే వ్యాపారులు పాటించవలసిన విధానం. తప్పిదమైన గుండ్లు పెట్టు కొనిన ఎడల ప్రభువు వాళ్ళని దీవించరు. మన చేతి పనులు దీవించబడాలి అంటే మన సమస్త కార్యములలో యదార్ధముగా నడుచుకొనుట చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యదార్ధమైన మనుష్యుడు పరిపూర్ణ ఆశీర్వాదం పొందుకుంటాడు. 

 

(2) వ్యత్యాసం గల హృదయము 

వ్యత్యాశముగల హృదయము యెహోవాకు హేయము (సామెతలు 11: 20). యదార్థతలేని, దేవునికి ఇష్టము లేని జీవితం జీవించేవారు అనగా నీతికి యదార్థతకు వ్యతిరేకంగా కార్యాలు చేసేవారు యెహోవాకు అసహ్యలు. నీతిమంతులు నేరస్తులుగాను, నేరస్తులను నీతిమంతులుగాను న్యాయము తీర్చే అబద్ధికులను దేవుడు అసహ్యిస్తున్నారు. లంచమపుచ్చుకొని నీతిని తిరస్కరించేవారిని శిక్షించుటకు ఆయన సిద్ధపడుతున్నారు. మనం ఇలాంటి అసహ్యమైన కార్యాలు చేయకుండా దానికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడదాం. 

 

(3) అబద్దమాడు పెదవులు 

అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు (సామెతలు 12: 22). అబద్దాన్ని సాధారణంగా మాట్లాడేవారు అనేకులు కలరు. వాళ్లకు ఇది తప్పు ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యము అనే గ్రహింపు ఉండదు. అబద్ధములాడేవారు రెండవ మరణమైన అగ్ని గుండంలో వారు పాలు పొందుతారు అని బైబిల్ హెచ్చరిస్తుంది. అబద్దాలను ఆడుతున్న ప్రతి ఒక్కరు దేవుని రాజ్యాన్ని ప్రవేశించరని బైబిల్ చెప్తుంది. (ప్రకటన 21: 27) 

 

(4) దుర్మార్గుడు యొక్క మార్గము 

దుర్మార్గుడు యొక్క మార్గము, వారి యొక్క బలిని వారి యొక్క హృదయములను దేవుడు అసహ్యించుకుంటున్నారు. నీతిని వెంబడించే వారిని అని ప్రేమిస్తున్నారు. శ్రేష్టమైన వారి యొక్క ప్రార్ధన ఆయన వినుటకు ఆయన ఇష్టపడుతున్నారు. 

 

(5) గర్విష్టులు యెహోవాకు అసహ్యలు 

గర్విష్టులు యెహోవాకు అసహ్యలు కాబట్టి దీనత్వాన్ని ధరించి కొని దేవునికి హేయమైన కార్యాలు విడిచిపెట్టి దేవునికి ప్రియమైన వారిగా నడుచుకొని జీవించిన యెడలా దేవుడు సిద్ధము చేసిన దీవెనలు మనం సొంతం చేసుకుంటాం. ఆమెన్! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:

ఆమెన్ విలేజ్ టీవీలో మన కార్యక్రమాలను తయారు చేసే మన సేవకులకు కొరకు అలానే వారితో కలిసి పనిచేస్తున్న మిషనరీలు కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet kalebet perabet pashagaming virusbet imajbet perabet perabet giriş perabet perabet giriş egebet