Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.11.2023
Share:

By Village Missionary Movement

Monday, 06-Nov-2023

దిన ధ్యానము(Telugu) 06.11.2023

 

అంశం: తప్పిపోయిన గొర్రె

 

"నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును" - యోహాను 10:11

 

కాపరి ఒకాయన తన మందను మేపుటకు కొండ అడుగు భాగమునకు నడిపించుకుని వెళ్ళాడు. మందలో అల్లరి చేసే గొర్రె ఒకటి మేపుటకు తీసుకుని వెళ్ళినప్పుడు తన కన్నులెత్తి చూసింది కొంత దూరంలో పచ్చికగల గడ్డిని చూసింది. అత్యాశ వలన ఆ గొర్రె కాపరి కళ్ళును కప్పి కొంత దూరంలోకి వెళ్లిపోయింది. ఇంకా కొంత దూరం ఇంకా కొంత దూరం అని కాపరి యొక్క కంటికి కనబడకుండానే పోయింది. చీకటి పడినందున దారి తప్పిపోయిన గొర్రెకు భయము వేసింది. క్రూర మృగం యొక్క స్వరములు వినబడుతున్నాయి భయముతో కూడిన బాధతో నిలబడిపోయింది. కాపరి తన మంద అంతటినీ కూడా ఇంటికి చేర్చిన కాపరికి కనబడకుండా పోయిన గొర్రెను వెతుకుతూ వచ్చారు. ముండ్ల పొదల మధ్యలో నిలబడి ఉన్న గొర్రెను చూశారు. సంతోషముతో దాన్ని విడిపించి తన భుజముల పైన వేసుకొని మంద వైపు వెళ్లారు. 

 

బైబిల్లో కూడా తన దృష్టికి అందంగా కనబడిన సదోమా గొమోరా పట్టణము దగ్గర గల యోర్ధాను వైపునకు అబ్రహామును విడిచి లోతు వెళ్ళాడు. ఆ పట్టణంలో అతిక్రమము విస్తారముగా ఉండటం వలన దేవుడు దానిని పతనము చేయడానికి తన దూతలను పంపించారు. దాంట్లో లోతును తప్పింపజేసి బయటకు పంపించారు. ఆయన భార్య వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. పిల్లలు ఇద్దరు కూడా పాపము చేశారు. మోయాబు, అమ్మోను అనే ఇద్దరు సంతతులు వారి ఇద్దరి నుండి వచ్చాయి. తప్పిపోయిన ఆ సంతతి వారిని రక్షించుటకు మొవాబు స్త్రీ అయినా రూతు ద్వారా మరల తన రక్షణ ప్రణాళికను ప్రారంభించారు దేవుడు. కావున ఆయన ఏ ఒక్కరిని కూడా తిరస్కరించే దేవుడు కాదు కదా! 

 

ప్రియమైన వారలారా ప్రపంచపు పాపపు బురదలో పొర్లాడుతున్న మనలను రక్షించుటకు యేసుక్రీస్తు మన కొరకు వచ్చారు. కనబడకుండా పోయిన గొర్రెల మైన మనలన రక్షించుకొనుటకు తన ఆఖరి రక్తపు బిందువు వరకు మన కొరకు చిందించారు. ముళ్ళ కిరీటము ధరించుకున్నవారుగా గాయాలు పొందుకొని కొట్టబడి నలగగొట్టబడ్డారు. మన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలిగిన మంచి కాపరి కదా ఇంకను యేసయ్య మందలో చేరకుండా దారి తప్పిపోయిన గొర్రెలుగా మీరు ఉన్నారా? మంచి కాపరి అయిన మన తండ్రి ఈ దినం వరకు కన్నీటితో మమ్మల్ని వెతుకుతూ ఉన్నారు. దేవుడు ఇంకనూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ యొక్క పాపములన్నీ మర్చిపోయారు కానీ మిమ్మల్ని ఎన్నడు మరువరు ఆయన భుజం మీద మోయుటకు సిద్ధముగా ఉన్నారు. 

- సిస్టర్. మంజుల గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఆమెన్ విలేజ్ టీవీ శాటిలైట్ టీవీగా మార్చడం కొరకు తీసుకున్న ప్రయత్నంలో దేవుని హస్తము తోడైయుండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet