Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.11.2023
Share:

By Village Missionary Movement

Saturday, 04-Nov-2023

దిన ధ్యానము(Telugu) 04.11.2023

 

అంశం: దేవుని ప్రసన్నత

 

“ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా” - బ్రీయులకు 13:5

 

జీవితంలో కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నారా లేదా అనే ప్రశ్న దేవుని యొక్క పిల్లలకు కలుగుట సహజం. నేను నిన్ను విడువను ఎడబాయను అనే వాగ్దానం ఇచ్చిన మాట తప్పని దేవుని యొక్క ప్రసన్నతను మనము ఎందుకు గ్రహించలేకపోతున్నాము అనే కారణములను బైబిల్ ద్వారా నేర్చుకుందాం. 

 

దుఃఖము:- యేసుప్రభు యొక్క మరణము వలన మిక్కిలి దుఃఖములో ఉండిన మగ్దలేనే మరియకు యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయనను గ్రహించలేదు. యమ్మాయి అను ఊరుకు వెళ్తున్న శిష్యులు ఇద్దరితో యేసుప్రభు నడుస్తూ వెళ్లారు. వాళ్లు దుఃఖముతో ఉన్నందున యేసు యొక్క ప్రసన్నతను గ్రహించలేదు. కారణము వీళ్ళందరూ యేసు యొక్క శ్రమలు, పునరుద్దానముల గురించిన వాక్యములను గ్రహించలేదు. సకల విధములైన సమాధాన కర్త అయిన దేవుని వాక్యములు మన దుఃఖములను మన కష్ట సమయంలో ఆదరించగలిగిన మాటలు కాబట్టి వాటిని గ్రహించి యుండుట ఎంత ప్రాముఖ్యము? 

 

భయము:- భయము ఒక వ్యతిరేకమైన కార్యము విశ్వాసాన్ని అణిచివేస్తుంది. ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందిని పోషించిన అద్భుతము తర్వాత తమకు ముందు అవతల ఒడ్డుకు వెళ్ళమని యేసు చెప్పారు. సముద్రంలో తుఫాను వచ్చి పడవ మునిగిపోయే పరిస్థితిలో యేసుప్రభు సముద్రం మీద నడుస్తూ వారి వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు దానిని చూచి భయపడి దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు దేవుని ప్రసన్నతను గ్రహించలేదు. ఆయన చెప్పి ప్రారంభించిన ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు కలుగవు అనే విశ్వాసం వాళ్లకు లేదు. వారి ముందు ఆయన చేసిన అద్భుతాలు వాళ్లకు గుర్తుకు రాలేదు. నేను భయపడిన దినమున దేవుని నమ్మేదను అని దావీదు చెబుతూ ఉన్నాడు. మనం దేవున్ని ఆయన వాగ్దానములను నమ్మేదము. 

 

వెనుదీయుట:- పేతురు మరియు కొందరు శిష్యులు వెనకకు వెళ్ళిపోయిరి. వారు సముద్రంలో చేపలు పట్టుటకు రాత్రంతా ప్రయాసపడినను ఏమి దొరకలేదు. ఉదయకాలమున సముద్రపు ఒడ్డున యేసు నిలబడి ఉండుటను వారు గ్రహించలేదు కానీ యేసు 153 పెద్ద చేపలను పట్టమని వారి మధ్య తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఆయనను గ్రహించుకున్నారు. మనము కూడా వెనక్కి తిరిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక కార్యముల ద్వారా యేసయ్య తన ప్రేమను గ్రహింప చేస్తూ ఉంటున్నారు. అప్పుడు ఆయన ప్రసన్నతను గ్రహించి ఆయన తట్టు మరలా తిరుగుదాము. 

- ఎన్నడు మారని దేవుడు మన చేయి విడువడు మనలను యెడబాయడు। హల్లెలూయ! 

 

శ్రీమతి. గీత రిచర్డ్ గారు 

ప్రార్థన అంశం సువార్త క్యాంపులో దర్శించబడుతున్న చిన్నపిల్లలు యవనస్తుల గురించి ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet