By Village Missionary Movement
Wednesday, 01-Nov-2023దిన ధ్యానము(Telugu) 02.11.2023
అంశం: పాదములకు దీపము
"నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది" - కీర్తనలు 119:105
19వ శతాబ్దంలో ఐరోపా ఖండం అంతటిని తన వసము చేసుకోవాలి అని ప్రయాసపడిన వాడు నెపోలియన్. కానీ ఆయన వాటర్లు అనే స్థలంలో జరిగిన యుద్ధంలో అపజయము పొంది హెలిన అనే దీవిలో చెరసాలలో ఖైదీగా బంధింపబడ్డాడు. ఒకసారి ఆయనను దర్శించుటకు వచ్చిన ఆయన స్నేహితుడు ఒకరు ఆయనకు చెస్ బోర్డు ఒకటి ఇచ్చి వెళ్లారు. నెపోలియన్ దానితో ఆడుకొని తన సమయాన్ని గడిపేవారు. తర్వాత రోగం వల్ల మరణించాడు. ఆయన వాడుకున్న వస్తువులు అన్నీ కూడా వేలం వేశారు. దానిని పొందుకున్న వారు మిక్కిలి ఆసక్తితో ముందు వెనక చూచేటప్పుడు దాంట్లో ఒక మూలలో ఒక చిన్న బటన్ ఉండుట చూసి దాన్ని నొక్కారు. దానిలోనుండి బయటికి వచ్చిన ఒక మ్యాప్ లో ఆ దివి నుండి బయటికి వచ్చే మార్గము ఒకటి అందులో చూశారు. నెపోలియన్ అనేక దినములు వాడినప్పటికీ దానిలో ఉన్న మ్యాపును ఆయన చూడలేదు ఒకవేళ ఆయన ఆ మ్యాప్ ను చూసి ఉంటే?
మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ బైబిల్లో కీర్తనలు 119:105 ఈ విధంగా రాయబడి ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోములకు వెలుగై ఉన్నది అని అలాగైతే మనము కీడు నుండి తప్పించుకొని నిత్యజీవం పొందుకొనుటకు ఆయన మ్యాప్ ను బైబిల్ రూపంలో మన చేతికి ఇచ్చారు.
ప్రియమైన వారలారా! ఏ కాలంలో ఎలాంటి వయస్సు గల వారికైనా ఒక శ్రేష్టమైన మార్గదర్శి బైబిల్. ఒకవేళ మనకు అనేక తెలివితేటలు అనుభవాలు ఉండినప్పటికీ జీవితంలో అనేక పరిస్థితిలో చెరసాలలో వేయబడిన అనుభవాలు ఉండి ఉంటే బైబిల్ ఇంకనూ ఎక్కువగా చదువుదాం. ఎలాంటి పరిస్థితిలోనూ క్లిష్టమైన పరిస్థితిలోనూ నిర్ణయం తీసుకుంటూ అనేక సందర్భాలలో మనకు మంచి ఆలోచనకర్తగా మార్గదర్శక ఉండుట ఈ బైబిలే కాబట్టి మనకు సమయం దొరికినప్పుడల్లా మాత్రమే కాదు సమయం తీసుకుని బైబిల్ చదువుదాం దాన్ని ప్రేమిద్దాం మన జీవితంలో దానిని అభ్యసిద్దాం.
- బ్రదర్. భాగ్యనాధన్ గారు
ప్రార్థన అంశం:
7000 మంది మిషనరీలు ఒక లక్ష గ్రామాలు అనే గురిని మనం త్వరగా చేరుకునేటట్లు ఆ ప్రయత్నంలో దేవుని హస్తము తోడై ఉండేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250