Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.10.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 31-Oct-2023

దిన ధ్యానము(Telugu) 31.10.2023

 

అంశం: మంచి పరుగు

 

"మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని" - 2 తిమోతికి 4:7

 

భారతదేశంలో మొట్టమొదటిగా పరుగు పందెంలో ఘనత సాధించిన మన్ కవూర్ అనే స్త్రీ తన 103వ సంవత్సరంలో పోలాండ్ దేశంలో 2011వ సంవత్సరం జరిగిన ప్రపంచ మాస్టర్స్ పరుగుల పందెంలో పాల్గొన్నారు. ఆశ్చర్యకరముగా ఈటెను విసురుట, ఇనుప గుండును విసురుట, 60 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెం అని నాలుగు భాగాలలో మన్ కవూర్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. దాంట్లో ఆశ్చర్యము 2017లో జరిగిన పరుగు పందెం కంటే ఈమె చాలా వేగంగా పరిగెత్తారు. తన మూడు తరముల సంతానమును చూశారు. 

 

అపోస్తులుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి తన జీవితపు చివరి దినాలు గురించి చక్కగా రాస్తున్నారు. నేను నా దేహమును విడిచి వెళ్లే సమయం వచ్చింది 2 తిమోతి 4:6-7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుద ముట్టించితిని, విశ్వాసమును కాపాడు కొంటిని ఇది మొదలుకొని నీతికిరీటము నా కొరకు ఉంచుబడి ఉన్నది అని పౌలు తన ఆశ్చర్యకరమైన సాధన కార్యములను తన శిష్యుడైన తిమోతికి వివరించి చెబుతున్నాడు. 

 

 ప్రియమైన వారలారా! మనము మన జీవితంలో ప్రభువు కొరకు చేసిన కార్యములు ఏమిటి? నా వయసు పైబడినది నేనేమీ చేయలేను అని తప్పుకుంటున్నామా? లేక ఉన్నచోటనే దేవుని కొరకు సాక్షిగా వెలుగుగా ప్రకాశించడం కోరుకుంటున్నామా? పౌలు తన యొక్క బలహీనమైన సమయంలో కూడా నా బలము నీకు చాలును, నీ బలహీనతయందు నా బలము సంపూర్ణముగా నీకు అనుగ్రహింపబడును అని ఉత్సాహవంతమైన మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుతో ఉండి మన పరుగును మనం ముందుకు తీసుకుని వెళ్లాలి కాబట్టి మన పరుగును చక్కగా ముగించుటకు వయసు ఎంత మాత్రమూ ఆటంకం కాదు. కాబట్టి షాకుల విడిచిపెడదాం. బలహీనతలు, శ్రమలు, వయసు దేవుని కొరకు జీవించుటకు ఎంత మాత్రం ఆటంకము కాదు అనే దాన్ని గ్రహించి ముందుకు ధైర్యముగా పరిగెడదాం. దేవుని సహాయముతో చక్కగా మన పరుగును ముగిద్దాం. ప్రభువు మనకు సహాయం చేయను గాక! 

- శ్రీమతి. జ్ఞాన సెల్వం సెల్వ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం: 

తమిళనాడులో గల అన్ని ఫీల్డ్ లో ఉజ్జీవపు ప్రార్థన గదులు కట్టుటకు అవసరమైన స్థలము దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet