Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.10.2023
Share:

By Village Missionary Movement

Saturday, 28-Oct-2023

దిన ధ్యానము(Telugu) 28.10.2023

 

అంశం: ఉన్నతమైన దేవుని ప్రణాళిక

 

"నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది" - కీర్తనలు 139:14

 

మన శరీరం ఎలా పనిచేస్తుంది అది ఎలా సృష్టించబడింది అనేదాన్ని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించి చూసారా? మనం శిశువుగా ఉండేటప్పుడు 350 ఎముకలు కలిగిన మనము ఎదిగేటప్పుడు ఒకదానికి ఒకటి కలిసిపోయి 206 ఎముకలుగా మారిపోతున్నాయి. దీంట్లో 52 ఎముకలు మన పాదంలోనే మాత్రము అమర్చబడి ఉంది ఇది ఆశ్చర్యం కదు! 

 

మన వేలిముద్రలు మాత్రమే కాదు మన నాలుకలో గల ముద్రలు , మన కనుపాపలో కూడా ప్రత్యేకమైనవిగ ఉంటున్నాయి. మన శరీరంలో ఉండే నీటిని అనేక బిందుల్లో నింపవచ్చు. మన జీవితంలో మన నోట్లో ఊరే లాలాజలం రెండు ఈత కొట్టే చెరువుల్లో నింపవచ్చు. మన మెదడు 85% నీటితో తయారైవుంది. మన శరీరంలో ఈ జీవ అంశములను మరియు అవయవాలు పనిచేయుటను కొద్దిగా ఆలోచించిన యెడల మనలను సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడొ మన గ్రహించుకోగలం.  

 

భక్తుడైన దావీదు కీర్తన పుస్తకముల రాస్తున్నాడు నీవు నన్ను కలుగజేసిన విదము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. మీ క్రియలు ఆశ్చర్యకరములు అది నా ప్రాణమునకు బాగా తెలియుును అని దావీదు దేవుని యొక్క సృష్టిని చక్కగా గ్రహించిన వాడిగా ఉన్నాడు. 

 

ప్రియమైన వారలారా మన యొక్క శరీరంలో ప్రతి అవయవమును ఆయన చక్కగా అమర్చి మనలను ఇంత చక్కగా తయారు చేసిన ఆయన మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన యొక్క ప్రారంభము మనము చేస్తున్న పని మన యొక్క భవిష్యత్తు అని సమస్తాన్ని ఆయన గ్రహించిన వాడిగా గొప్ప ప్రణాళిక కలిగినవాడిగా ఉన్నాడు. మన ప్రణాళిక లోకానుసారమైనది కాదు పరలోకానుసారమైనది అది అశాశ్వతమైనది కాదు శాశ్వతమైనది కాబట్టి ఆ ప్రణాళికకు మనలను మనము సమర్పించుకుందాం, ప్రయాణిద్దాం. మేలైన దేవుని ప్రణాళిక అనే కేంద్ర బిందువుగా మనం ఉండేటప్పుడు మనల్ని గురించిన దేవుని ప్రణాళికను మనము కచ్చితంగా నెరవేరుస్తాం. ఆమెన్! 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో ఉంటున్నా రిటైర్డ్ మిషనరీలను సపోర్ట్ చేసే అనేకమంది లేచేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al