By Village Missionary Movement
Thursday, 26-Oct-2023దిన ధ్యానము(Telugu) 27.10.2023
అంశం: సువాసన (smell)
"మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము" - 2 కోరింథీయులకు 2:14
భారతదేశంలో చెట్టుకు పండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి దాల్చిన చెక్క అనే చెక్క. ఈ దాల్చిన చెక్క ఆహారాన్ని పాడవకుండా కాపాడే గుణము కలిగినది. ఈ చెక్కలో ఫినాల్ అనే కెమికల్ ఉండడం వలన ఆహారం పైన బ్యాక్టీరియా రాకుండా చేసి పాడవకుండా కాపాడుతుంది. అందువలన దీనిని ప్రాముఖ్యంగా మాంసాలను వండినప్పుడు వాడుతున్నారు మరియు ఈ చెక్క ఆహారంనకు మంచి సువాసనను ఇస్తుంది. ఇలాంటి శ్రేష్టమైన గుణాతిశయము సాధారణమైన చెట్టుకు ఇచ్చిన వారు దేవుడే.
మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ చేత అరణ్యమునకు తీసుకునిపోబడ్డారు అప్పుడు సాతాను అనేకమైన శోధనలతో యేసయ్యను శోధించుట మనం చూడవచ్చు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమని సాతాను చెప్పినప్పుడు దానికి జవాబుగా యేసుప్రభు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నదే. ఖచ్చితంగా యేసయ్య సువాసన మాటల చేత మాత్రమే ఈ యొక్క సాతాను జయించగలిగారు. యేసయ్య భూలోకంలో జీవించిన దినాలలో ఆయన మాటలలో ఆయన క్రియలలో అద్భుతాలు చేయగలిగిన చోట్లలో ఆయన సువాసనను వెదజల్లారు కారణము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నిండి ఉండుటవలనే.
ప్రియమైన వారలారా! ఎలాగు ఒక దాల్చిన చెక్క ఆహారమునకు మంచి సువాసన ఇచ్చేదిగా చేస్తున్నదో అలాగే దేవుని మాటలు మనలో ఉండేటప్పుడు అవి జీవపు సువాసనగా బయటపడతాయి. ఆ మాటలే బ్యాక్టీరియా అనే ఈ కీడైన సాతానును పతనము చేసే శక్తి గలదిగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము యేసు యొక్క సువాసనను ఇచ్చే వారముగా ఈ భూలోకంలో మనలను ఆయన పెట్టియున్నారు. మనకు ఇవ్వబడిన కాలము ముగించేలోగా ఎక్కడెక్కడ సువాసన వెదజల్లాలో అక్కడ సువాసన ఇవ్వాలి. ఒక సాధారణ చెట్టుకి ఇలాంటి సువాసన ఇవ్వగలిగిన గుణాతిశయమును దేవుడు ఇచ్చిన యెడల ఆయన పోలికలో సృష్టించబడిన మనకు ఆ శక్తినిచ్చుట దేవుడు మానునా?
- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు
ప్రార్థన అంశం:-
ఫీల్డ్ లో స్కూల్ మరియు కాలేజీ చదువుల్లో మన పరిచర్య ద్వారా ఆదరింపబడుతున్న విద్యార్థుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250