By Village Missionary Movement
Wednesday, 25-Oct-2023దిన ధ్యానము(Telugu) 25.10.2023
అంశం: జీడి మిఠాయి
“అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము” - ఆదికాండము 17:1
నేను బాలుడుగా ఉండేటప్పుడు మా ఊర్లో పాత వస్తువులకు, ఇత్తడి పాత్రలకు జీడి మిఠాయి అని సైకిల్ పైన వ్యాపారులు అమ్ముతూ వచ్చేవారు. నేను ఆశగా దాని వైపు చూస్తూ ఉండేవాడిని. తినడానికి ముందు దానిని నా చేతిలో పెట్టుకొని దానిని పైకి క్రిందికి లాగుతూ గుండ్రంగా నాకు నచ్చినట్లుగా చేస్తూ ఆడుకునేవాడిని. అది నేను లాగుతున్నట్లుగా రావడం వలన నాకు చాలా సంతోషంగా ఉండేది.
బైబిల్లో కూడా గాడిదలను వెతుకుటకు వెళ్లిన సౌలును దేవుడు రాజుగా చేశారు కానీ సౌలు అయితే దేవుని సర్వశక్తిమంతుడిగా చూడకుండా తన ఇష్టానుసారముగా లాక్కొన వచ్చు జీడిమెట్ అయి వలె అనుకున్నాడు. దేవుని మాట సౌలు దగ్గరికి వచ్చింది ఇంక నువ్వు వెళ్లి అమాలీకీయులను పతనము చేసి వారికి కలిగిన సమస్తమును నాశనము చేయమని కనికరము చూపకుండా పురుషులను స్త్రీలను పశువులను ఒంటెలను గాడిదలను హతమార్చమని చెప్పారు. కానీ సౌలు అయితే అమాలేకీయుల రాజైన ఆహాగును ప్రాణంతో వదిలేసి పశువులలో మంచి వాటిని ప్రత్యేకంగా పెట్టుకొని అల్పమైన వాటిని పనికిమాలిన వాటిని నాశనం చేశారు. సౌలు హృదయంలో తాను చేసినదంతా నీతి అని అనుకున్నాడు ఇదంతా దేవుడు పట్టించుకోరు అని దేవుని తన కార్యానికి తగినట్టుగా వంచుకున్నాడు.
ఈ దినము కూడా అనేకులు ఇలా చేసి దేవుడు మనల్ని వదిలేస్తారు దీంట్లో తప్పేముంది అని తమ క్రియల గురించి తామే న్యాయం చేసుకుంటారు. మారుగా యెషయా 64: 6లో మా నీతి అంతా కూడా మురికి గుడ్డ వలే ఉన్నది అనే తలంపు మనకు ఉండాలి. ప్రియమైన వారలారా దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్లో నీతి అన్నది బైబిల్ చెప్తున్నదే నీతి అనీతి అన్నది ఏమి చెబుతుందో అదే ఆ నీతి అంతకుమించి ఏమీ లేదు.
కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి జీడి మిఠాయి వలె మనకు తగ్గట్టుగా లాక్కొనవచ్చు అని తలంచుకుడి. మీరును నేను యెహోవా చేతుల్లో జీడి మిఠాయి వలె ఉండాలి తప్ప ఆయన వాక్యానుసారముగా ఆయనను మనము లాక్కొనకూడదు అని ఆలోచన ఎప్పుడూ మనకు ఉండాలి. అలా ఉంటే ఎప్పుడూ మనకు దీవెనకరమే!
- బ్రదర్. సిమ్యోన్ గారు
ప్రార్థన అంశం:
యవ్వనస్తులకు కూడికలో పాల్గొంటున్న యవ్వనస్తులు ప్రతి ఒక్కరూ దేవుని హస్తంలో బలముగా వాడబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250