Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.10.2023
Share:

By Village Missionary Movement

Saturday, 21-Oct-2023

దిన ధ్యానము(Telugu) 22.10.2023

 

అంశం: సువార్త ప్రకటించాలి

 

ప్రత్యేకముగా చిన్నపిల్లల కొరకు

 

"మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" - మార్కు 16:15

 

రాబర్ట్ అంకుల్ చాలా గొప్ప వ్యాపారవేత్త. పేదలకు సహాయము చేసే మంచి మనసు గలవారు. తన కంపెనీలో పని చేస్తున్న వ్యక్తులకు ఆయన కుటుంబంలో బంధువులకు ఎవరికైనా కష్టమొస్తే వెంటనే పరిగెత్తుకొని వెళ్లి సహాయము చేసే వ్యక్తి. ఒక దినము ఆయన నిద్రిస్తూ ఉండగా రాబర్ట్ అంకుల్ కలలో పరలోకము మరియు నరకం గురించి ఒక పిక్చర్ వచ్చింది. దాంట్లో భూలోకంలో గల మనుషులందరూ ఎక్కుతున్నవారుగా ఉన్నారు. మరియు ఒక గుంపు జనాలు వరుసలో నిలబడి ఉన్నారు. మరియు ఒక దూత పెద్ద పుస్తకాన్ని తిప్పి చూపిస్తున్నారు. ఆ పుస్తకంలో పేరు లేని వారిని ఎడమవైపు పంపిస్తున్నారు ఎడమవైపు మండుతున్న అగ్నియు కుడి ప్రక్కన తెల్లటి పాలరాతి వంటి పరలోకపు భవనం ఉన్నది. ఈ వరుసలో రాబర్ట్, ఆయన పనిచేస్తున్న కంపెనీలో ఉన్న రాము నిలబడి ఉన్నారు. అ దూత రాబర్ట్ ను కుడివైపు వెళ్ళమని చెప్పారు. రాముని ఎడమవైపు వెళ్ళమని చెప్పారు. రాము భయపడి పోయి వణుకుతూ నేను ఆ మండుతున్న అగ్నిగుండంలోనికి వెళ్ళను నన్ను అక్కడికి పంపించకూడదు అలాగైతే ఒకటి చేయండి అక్కడి నిలబడి ఉన్న నా యజమానుడైన రాబర్ట్ ని కూడా నాతో పాటు పంపించండి. ఆయన ఒక క్రైస్తవుడై ఉండి నాకు యేసయ్య గురించి చెప్పలేదు. నరకము పరలోకము ఉందని నరకం మండుతూ ఉంటుందని చెప్పలేదు. ఆయన చెప్పి ఉంటే నేను మారు మనసు పొంది ఉండేవాడిని అని బిగ్గరగా ఏడ్చాడు. అలా ఏడుస్తున్న స్వరము విని దిగ్బ్రాంతితో కళ్ళు తెరుచుకున్నారు రాబర్ట్ అంకుల్. అప్పుడే ఆయనకు అర్థమైంది మనము ఇతరులకు ఎంత సహాయం చేసినా వారి వద్ద నుండి మంచి పేరు పొందుకున్న వాళ్లకు ఒక్కసారి కూడా యేసయ్య గురించి చెప్పలేదే. నేను పెద్ద పొరపాటు చేశాను అని గ్రహించి ఆ దినము మొదలుకొని ఆ కంపెనీలో పని చేసే వాళ్ల అందరికీ యేసయ్య గురించి చెబుతున్నారు. 

 

ఏంటి పిల్లలు మీరు మాత్రమే మంచివారిగా ఉండి యేసయ్యను తెలుసుకుని పరలోకానికి వెళ్తే చాలా? మీ తోటి చదువుకున్న వారికి మీరు సహాయం చేస్తే మంచిదే కానీ వాళ్లకు యేసయ్య గురించి ఎవరు చెబుతారు? మీ ఊర్లో ఉన్న వారందరూ కూడా పరలోకానికి వెళ్లాలి కదా? కాబట్టి ఆ రాబర్ట్ అంకుల్ వలే ఈ దినం మొదలుకొని తెలిసిన వాళ్ళందరికీ యేసయ్య గురించి చెప్పడం మర్చిపోకండి. చెబుతారా సరే! 

- శ్రీమతి. అనిత అలగర్ సామీ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet